విషాదం: 11 మంది జవాన్లు దుర్మ‌ర‌ణం!

ఛత్తీస్‎గఢ్‎లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్ప‌డ్దారు. దంతెవాడ‌లో జిల్లాలో శక్తివంత‌మైన భారీ ఐఈడీ మందుపాత‌రని పేల్చ‌డంతో 11 మంది డిఫెన్స్ రీసెర్చ్ జ‌వాన్లు చ‌నిపోయారు. మృతులో 10 మంది డీఆర్‌జీ జ‌వాన్లు, ఒక డ్రైవ‌ర్ ఉన్నారు.…

ఛత్తీస్‎గఢ్‎లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్ప‌డ్దారు. దంతెవాడ‌లో జిల్లాలో శక్తివంత‌మైన భారీ ఐఈడీ మందుపాత‌రని పేల్చ‌డంతో 11 మంది డిఫెన్స్ రీసెర్చ్ జ‌వాన్లు చ‌నిపోయారు. మృతులో 10 మంది డీఆర్‌జీ జ‌వాన్లు, ఒక డ్రైవ‌ర్ ఉన్నారు. జవాన్లు కూంబింగ్ ముగించుకుని మినీ బస్సులో వెళ్తుండగా నక్సలైట్లు మందుపాతర పేల్చాడంతో ప్ర‌మాదం జ‌రిగింది.

ఛత్తీస్ గఢ్ లో తరచుగా ఎన్ కౌంటర్లు జరుగూతూనే వుంటాయి. గతంలో కూడా రాష్ట్రంలో పలు ఎన్ కౌంటర్ల జరిగాయి. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు పోలీసులు, మావోయిస్టులు చనిపోయారు. తాజాగా మ‌వోయిస్టులు దుశ్చర్య వ‌ల్ల జ‌వాన్లు మ‌ర‌ణించారు. ఈ నెల మొద‌టి వారంలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు.

కాగా ఈ విషాద ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించిన ఛత్తీస్‎గఢ్‎ ముఖ్య‌మంత్రి భూపేశ్ భ‌ఘెల్.. మ‌వోలు త‌గిన మూల్యం చెల్లించుకుంటార‌ని హెచ్చ‌రించారు.