డిప్యూటీ సీఎంను మెడ పట్టుకుని ఈడ్చుకెళ్లిన పోలీసులు!

రాజ‌కీయ నేత‌ల‌కు అధికారం లేక‌పోతే ప్ర‌భుత్వ అధికారులు వారి ప‌ట్ల ఎలా న‌డుచుకుంటారో ఇవాళ‌ ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ప‌ట్ల పోలీసులు ప్ర‌వ‌ర్తించిన తీరును చూస్తే సృష్టంగా క‌న‌ప‌డుతోంది. అధికారంలో ఉన్న‌ప్పుడు…

రాజ‌కీయ నేత‌ల‌కు అధికారం లేక‌పోతే ప్ర‌భుత్వ అధికారులు వారి ప‌ట్ల ఎలా న‌డుచుకుంటారో ఇవాళ‌ ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ప‌ట్ల పోలీసులు ప్ర‌వ‌ర్తించిన తీరును చూస్తే సృష్టంగా క‌న‌ప‌డుతోంది. అధికారంలో ఉన్న‌ప్పుడు సెల్యూట్ కొట్టిన చేతులే ఆయ‌న్ను మెడ‌ప‌ట్టి ఈడ్చికెళ్లాయి.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న మ‌నీష్ సిసోడియాను జుడీషియల్ కస్టడీ కోసం కోర్టులో హాజ‌రుప‌రిచి తిరిగి జైలుకు తరలించే సమయంలో మీడియా ప్రశ్నలకు సిసోడియా సమాధానం ఇస్తుండగా ఓ పోలీస్ అధికారి ఆయన మెడ పట్టుకొని ఈడ్చుకెళ్లారు.

పోలీసులు సిసోడియాపై ప్ర‌వ‌ర్తించిన తీరు వైర‌ల్ కావ‌డంతో.. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితులు మీడియాకు ప్రకటన చేయడం చట్ట విరుద్ధమని.. భ‌ద్ర‌త కోణంలో త‌ప్ప‌నిస‌రిగా అధికారి అలా చేశార‌ని చెప్పుకొచ్చారు. ఈ ఘ‌ట‌న‌పై ఢిల్లీ సీఎం ఆగ్రహం వ‌క్తం చేస్తూ… పైవాళ్లు ఏమైనా చెప్పారా ఇలా చేయ‌మ‌ని అంటూ ట్వీట్ చేశారు.

కాగా మనీష్‌ సిసోడియా జ్యుడిషియల్‌ కస్టడీని ఢిల్లీ కోర్టు జూన్‌ 1 వరకు పొడిగించింది. ఫిబ్రవరి 26న విచారణ కోసం పిలిపించుకున్న సిబిఐ, ఢిల్లీ లోని ప్రధాన కార్యాలయంలోనే ఆయనను అరెస్టు చేయడం తెలిసిందే.