షర్ట్‌ కింద దాచి.. గోల్డ్ స్మ‌గ్లింగ్!

బంగారం అక్రమ రవాణాలో అక్రమార్కులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. నిఘా అధికారుల కళ్లు గప్పి బంగారాన్ని తరలించేందుకు నిందితులు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. అలాంటి ఘ‌ట‌నే కొచ్చి విమానాశ్ర‌మంలో జ‌రిగింది. దాదాపు అక్ర‌మ…

బంగారం అక్రమ రవాణాలో అక్రమార్కులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. నిఘా అధికారుల కళ్లు గప్పి బంగారాన్ని తరలించేందుకు నిందితులు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. అలాంటి ఘ‌ట‌నే కొచ్చి విమానాశ్ర‌మంలో జ‌రిగింది. దాదాపు అక్ర‌మ ర‌వాణా విదేశాల నుండి వ‌చ్చే ప్ర‌యాణికుల ముసుగులో చేసేవారు. కాక‌పోతే కొచ్చిలో విమానా సిబ్బందే అక్ర‌మ ర‌వాణాకు పాల్ప‌డారు.

వివరాలోకి వెళ్తే .. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బందిని బుధవారం కొచ్చి విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. వాయనాడ్‌కు చెందిన షఫీ అనే వ్యక్తి ఎయిర్‌ ఇండియా లో క్యాబిన్ సిబ్బందిగా ప‌ని చేస్తున్నారు. బహ్రెయిన్-కోజికోడ్-కొచ్చి సర్వీసులో బంగారం తీసుకువస్తున్నట్లు కస్టమ్స్ అధికారుల‌కు సమాచారం రావ‌డంతో అదుపులోకి తీసుకొవడంతో విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

నిందితుడు బంగారాన్ని చేతులకు చుట్టి, చొక్కా స్లీవ్‌ను కప్పుకుని గ్రీన్ ఛానల్ గుండా వెళ్లాలని ప్లాన్ చేశాడు. షఫీ నుంచి 1,487 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అతడిని మరింత లోతుగా విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.