లొంగిపోనున్న అమృత్ పాల్!

పంజాబ్ పోలీసుల‌ను ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన ఖలిస్తాన్ అనుకూల నేత, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను ఎట్ట‌కేల‌కు పోలీసుల‌కు దొరికాడు. గ‌త కొన్ని రోజులుగా రహస్య ప్రాంతాల్లో తలదాచుకున్న అమృత్…

పంజాబ్ పోలీసుల‌ను ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన ఖలిస్తాన్ అనుకూల నేత, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను ఎట్ట‌కేల‌కు పోలీసుల‌కు దొరికాడు. గ‌త కొన్ని రోజులుగా రహస్య ప్రాంతాల్లో తలదాచుకున్న అమృత్ పాల్.. ఇక పోలీసుల కళ్లుగప్పి పారిపోయే పరిస్థితి లేకపోవటంతో పంజాబ్‌లోని మోగా పోలీసుల ఎదుట అమృత్‌పాల్ లొంగిపోయిన‌ట్లు తెలుస్తోంది.

గ‌త కొంత కాలం క్రితం ఓ కిడ్నాప్ కేసులో అమృత్ పాల్ సింగ్ కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్ సింగ్ ను అమృత్‌సర్ జిల్లాలోని అజ్‌నాలా పోలీసులు ఓ కిడ్నాప్ కేసులో అరెస్టు చేశారు. దీంతో లవ్‌ప్రీత్ సింగ్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 24న పెద్ద సంఖ్యలో అమృత్‌పాల్ సింగ్ అనుచరులు పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. దీంతో లవ్‌ప్రీత్‌ను పోలీసులు వదిలివేయాల్సి వచ్చింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

యువతను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై అమృత్ పాల్ పై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్ప‌టి నుండి పోలీసుల‌కు చిక్క‌కుండా ప‌రారీలో ఉన్నాడు. ప‌రారీలో ఉన్న స‌మయంలో ప‌లు వీడియోలు విడుద‌ల చేస్తూ పోలీసుల‌కు స‌వాల్ విసిరారు. చివ‌రికి త‌ప్పించుకునే ఆవ‌కాశం లేక‌పోవ‌డంతో ఎట్ట‌కేల‌కు త‌నే స్వ‌యంగా లొంగిపోయారు.

మూడు రోజుల క్రిత‌మే అమృత్ పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్ లండన్‌కు పారిపోవాలని ప్లాన్ చేసిన ఆమెను శ్రీ గురు రామ్ దాస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇప్ప‌టికే అమెరికా, బ్రిటన్‌లో అమృత్‌పాల్‌ మద్దతుదారులు భారత దౌత్యకార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున అందోళ‌న చేశారు.