ట్విట్టర్ ను టేకోవర్ చేసినప్పట్నుంచి ఎలాన్ మస్క్, దానితో ఓ ఆట ఆడుకుంటున్నాడు. ఇష్టమొచ్చినట్టు మార్పు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్ బ్రాండ్ లోగోలో మార్పులు చేసిన ఆయన ఇటీవలే ట్విట్టర్‌కి ఎక్స్ అని నామకరణం చేశారు. తాజాగా ఎలాన్ మస్క్ ఎక్స్(ట్విట్టర్)లో మరో కీలక మార్పును తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
ఫోన్ నంబర్ లేకుండానే ఎక్స్(ట్విట్టర్)లో ఆడియో, వీడియో కాల్స్ అందుబాటులోకి తీసుకొస్తామని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ సదుపాయం ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్, పీసీలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు.
ఎలాన్ మస్క్ చెప్పినట్లు చేస్తే ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటాకు పెద్ద షాక్ అనే చెప్పోచ్చు. ఇప్పటికే మెటా నుండి వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ నుండి ఆడియో, వీడియో కాల్స్ ఫీచర్ ఉన్న విషయం తెలిసిందే. మరి ఎక్స్‌లో ఎప్పటి నుంచి ఈ ఫీచర్ అమలులోకి వస్తుందనేది మాత్రం తెలియాల్సి ఉంది.