తన ప్రభుత్వంపై తనకు తనే విశ్వాస పరీక్ష పెట్టుకొని విశ్వాస పరీక్షలో నెగ్గారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. 58 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ కు అనుకూలంగా ఓటు వేశారు.
70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 58 మంది ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి అనుకూలంగా ఓటు వేశారు.
విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ ఢిల్లీలో ఒక్క ఆప్ ఎమ్మెల్యేను కూడా బీజేపీ కొనుగోలు చేయలేక విఫలమైందన్నారు. మాకు 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరులో 58 మంది అనుకులంగా ఓటేశారన్నారు. ఓటు వేయని వారి నలుగురిలో.. ఇద్దరు విదేశాలలో, ఒకరు జైలులో ఉన్నారు. నాల్గవ సభ్యుడు సభకు స్పీకర్ అని అన్నారు.
గత వారం, 40 మంది ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ టార్గెట్ చేసిందని, పార్టీ మారేందుకు ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఆఫర్ చేసిందని సీఎం కేజ్రీవాల్ ఆరోపిస్తూ విశ్వాస పరీక్షను ఎదుర్కోన్నారు. ఇప్పటికైనా బీజేపీ ఎమ్మెల్యేలను కొనడం మానేయండి అంటూ సీఎం కేజ్రీవాల్ బీజేపీ నేతలకు హితవుచెప్పారు.