అంటార్కిటికా క్వీన్.. దెబ్బకు 10 గిన్నిస్ రికార్డ్ లు

అంటార్కిటికా. ధృవపు ప్రాంతంలో మంచు కొండలతో నిండి ఉన్న సముద్రం. అక్కడ ప్రయాణం అత్యంత ప్రమాదకరం. పెద్ద పెద్ద ఓడల్లో ప్రయాణం చేయడానికి కుదరదు. పడవల్లో వెళ్లాలంటే అదో పెద్ద సాహసమనే చెప్పాలి. అలాంటిది…

అంటార్కిటికా. ధృవపు ప్రాంతంలో మంచు కొండలతో నిండి ఉన్న సముద్రం. అక్కడ ప్రయాణం అత్యంత ప్రమాదకరం. పెద్ద పెద్ద ఓడల్లో ప్రయాణం చేయడానికి కుదరదు. పడవల్లో వెళ్లాలంటే అదో పెద్ద సాహసమనే చెప్పాలి. అలాంటిది అంటార్కిటికా సముద్రంలో ధైర్యంగా పడవ నడుపుతూ ఏకంగా 10 గిన్నిస్ రికార్డులు నెలకొల్పింది లిసా ఫార్తోఫర్ అనే మహిళ. 

31 ఏళ్ల ఈ ఆస్ట్రేలియన్ మహిళ.. 1915నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్న రికార్డులన్నిటినీ బద్దలు కొట్టింది.  

రెండు చేతుల్లో రెండు తెడ్డులు పట్టుకుని పడవను ముందుకు తీసుకెళ్లడమే రోయింగ్. సముద్ర జలాల్లో రోయింగ్ పోటీలు జరుగుతుంటాయి. ఆ పోటీలపై ఆసక్తి ఉన్న లిసా, ఆస్ట్రేలియాలోనే మంచి రోవర్ గా పేరు తెచ్చుకుంది. అంటార్కిటికాను తన రికార్డ్ బ్రేకింగ్ ఈవెంట్ కి వేదికగా ఎంపిక చేసుకుంది. లిసాతోపాటు, అమెరికా, యూకే, బల్గేరియా, ఐస్ ల్యాండ్ కి చెందిన కొందరు టీమ్ గా ఏర్పడ్డారు. రోయింగ్ లో సరికొత్త రికార్డులు సృష్టించారు.

జనవరి 11నుంచి 17 మధ్యన అంటార్కిటికా సముద్రంలో 407 నాటికల్ మైళ్ల దూరాన్ని పడవలో కవర్ చేసింది లిసా. అంటార్కిటికాలో తొలి మానవ యాత్రగా ఆమె ప్రయాణం రికార్డులకెక్కింది. 

స్కోటియా సముద్రంలో కూడా తొలి మానవ యాత్ర ఈమెదే కావడం విశేషం. అంటార్కిటికాలో అతి ఎక్కువ దూరం ప్రయాణించడం సహా.. మొత్తం 10 రికార్డులను లిసా సృష్టించింది. గతంలో ఉన్న కొన్ని రికార్డులు బద్దలు కొట్టడంతోపాటు, ఎవరూ ఇప్పటి వరకు సాహసం చేయని రికార్డ్ ఫీట్ లను తొలిసారిగా సాధించింది లిసా. తాజాగా గిన్నీస్ బుక్, ఈ రికార్డ్స్ అన్నింటినీ గుర్తించింది.