షిండే దెబ్బ‌.. థాక‌రేకు పార్టీ దూరం!

మహారాష్ట్ర రాజకీయం మ‌రో కీల‌క మ‌లుపు తీసుకుంది. మాజీ ముఖ్య‌మంత్రి, దిగ‌వంత శివ‌సేన పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు బాలాసాహెబ్ థాక‌రే కుమారుడు ఉద్ద‌వ్ థాక‌రే కు ఎన్నిక‌ల సంఘం షాక్ ఇచ్చింది. శివ‌సేన పార్టీ పేరుతో…

మహారాష్ట్ర రాజకీయం మ‌రో కీల‌క మ‌లుపు తీసుకుంది. మాజీ ముఖ్య‌మంత్రి, దిగ‌వంత శివ‌సేన పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు బాలాసాహెబ్ థాక‌రే కుమారుడు ఉద్ద‌వ్ థాక‌రే కు ఎన్నిక‌ల సంఘం షాక్ ఇచ్చింది. శివ‌సేన పార్టీ పేరుతో పాటు, విల్లు-బాణం గుర్తును కూడా పార్టీలో చీలిక వర్గమైన ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక‌నాథ్ షిండే వర్గానికే కేటాయించింది.

దాదాపు ఎనిమిది నెల‌ల త‌ర్వాత పార్టీ గుర్తును షిండే వ‌ర్గానికే ద‌క్కింది. గ‌త సంవ‌త్స‌రం జూన్ లోఉద్ద‌వ్ థాక్రేపై తిరుగుబాటు చేసి బీజేపీతో జ‌త క‌ట్టి ముఖ్య‌మంత్రి అయిన ఏక్ నాథ్ షిండే సార‌థ్యంలోని రెబ‌ల్ ఎమ్మెల్యేలు త‌మ గ్రూపును శివ‌సేన బాలాసాహెబ్ అని పేరు పెట్టుకున్నారు.

2019లో మ‌హారాష్ట్ర శాస‌న‌స‌భ‌కు జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా శివ‌సేన పార్టీ అధినేత‌ సీఎం ప‌ద‌వి కోసం కాంగ్రెస్, ఎన్‌సిపితో జ‌త క‌లిసి ఎమ్మెల్యే కాకుండానే ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కిన ఉద్ద‌వ్ థాక‌రేను సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప‌ద‌వి నుండి దించేయ‌డం తెలిసిందే. తాజాగా శివ‌సేన గుర్తును షిండే వ‌ర్గానికి కేటాయించ‌డంతో మ‌హారాష్ట్ర రాజకీయాల్లో కీల‌క మార్పులు జ‌ర‌గ‌వ‌చ్చు.