బ్ర‌హ్మానందం ప్ర‌చారం ఏం చేసిందంటే!

క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. ఈ విజ‌యం దేశ వ్యాప్తంగా విప‌క్షాల‌కు పెద్ద ఊర‌ట‌. క‌ర్నాట‌క‌లో గెలుపు కోసం బీజేపీ ఏ ఒక్క అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌లేదు.  Advertisement క‌ర్నాట‌క‌లోని టాలీవుడ్ హాస్య‌న‌టుడు బ్ర‌హ్మానందం…

క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. ఈ విజ‌యం దేశ వ్యాప్తంగా విప‌క్షాల‌కు పెద్ద ఊర‌ట‌. క‌ర్నాట‌క‌లో గెలుపు కోసం బీజేపీ ఏ ఒక్క అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌లేదు. 

క‌ర్నాట‌క‌లోని టాలీవుడ్ హాస్య‌న‌టుడు బ్ర‌హ్మానందం సైతం బీజేపీ త‌ర‌పున ప్ర‌చారం చేశారు. చిక్‌బ‌ళ్లాపూర్ బీజేపీ అభ్య‌ర్థి , వైద్య‌శాఖ మంత్రి సుధాక‌ర్‌కి మ‌ద్ద‌తుగా బ్ర‌హ్మానందం విస్తృత ప్ర‌చారం చేశారు. తెలుగు ప్ర‌జానీకం ఎక్కువ‌గా ఉన్న ప్రాంతంలో బ్ర‌హ్మానందం ప్ర‌చారం అందరి దృష్టిని ఆక‌ర్షించింది.

ఏపీలో బ్ర‌హ్మానందం ఎప్పుడూ ఏ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కానీ ప‌క్క రాష్ట్రంలో మాత్రం బీజేపీ త‌ర‌పున ప్ర‌చారం చేసి తాను బీజేపీ అనే సంకేతాలు పంపారు. బ్ర‌హ్మానందం రోడ్‌షోలు బీజేపీ అభ్య‌ర్థికి విజ‌యాన్ని అందించ‌లేక‌పోయాయి. 

బ్ర‌హ్మానందం కామెడీని ఇంత‌కాలం తెర‌పై చూసి న‌వ్వుకున్న జ‌నం… ఎన్నిక‌ల ప్ర‌చారంలో కొత్త గెట‌ప్‌లో ఆయ‌న్ను చూసి చ‌ప్ప‌ట్లు కొట్టారు. అంతే త‌ప్ప ఈవీఎంలో మాత్రం బీజేపీ అభ్య‌ర్థికి ఓటు వేయ‌డానికి బ్ర‌హ్మానందం ప్ర‌చారం క‌లిసిరాలేదు.

వైద్య‌శాఖ మంత్రిగా సుధాకర్ సేవ‌ల్ని బ్ర‌హ్మానందం కొనియాడారు. మ‌రోసారి అవ‌కాశం ఇస్తే మ‌రింత‌గా ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ప‌నులు చేస్తార‌ని బ్ర‌హ్మానందం చెప్పారు. ప్ర‌చారంలో భాగంగా బ్ర‌హ్మానందం తెలుగులోనే మాట్లాడారు. చివ‌రికి కాంగ్రెస్ అభ్య‌ర్థి ప్ర‌దీప్ ఈశ్వ‌ర్ చేతిలో బ్ర‌హ్మానందం మ‌ద్ద‌తు ప‌లికిన బీజేపీ అభ్య‌ర్థి సుధాక‌ర్ ఓడిపోయారు. 

బ్ర‌హ్మానందం విస్తృత ప్ర‌చారం చేయ‌డంతో చిక్‌బ‌ళ్లాపూర్ ఫ‌లితంపై తెలుగు ప్ర‌జ‌లు ఆస‌క్తిక‌న‌బ‌రిచారు.