జ‌మిలి ఎన్నిక‌ల‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం!

జ‌మిలి ఎన్నిక‌ల‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఒన్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదిక‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. వ‌చ్చే శీతాకాలం…

జ‌మిలి ఎన్నిక‌ల‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఒన్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదిక‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. వ‌చ్చే శీతాకాలం స‌మావేశాల్లో జ‌మిలీ ఎన్నిక‌ల బిల్లును ఆమోదించ‌నున్నారు.

రామ్‌నాథ్ కోవింద్ క‌మిటీ విస్తృతంగా అధ్య‌య‌నం చేయ‌డం, అలాగే ల‌క్ష‌లాది మంది అభిప్రాయాలు సేక‌రించిన త‌ర్వాత 18,626 పేజీల నివేదిక‌ను రాష్ట్ర‌ప‌తికి స‌మ‌ర్పించారు. అయితే జ‌మిలి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు రాజ్యాంగంలోని ఐదు అధిక‌ర‌ణ‌ల స‌వ‌ర‌ణ త‌ప్ప‌ని స‌రి.

ప‌లువురు ఎన్నిక‌ల మాజీ అధికారుల‌తో వ్య‌క్తిగ‌తంగా రామ్‌నాథ్ కోవింద్ క‌మిటీ చ‌ర్చించింది. వారి అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది. అయితే కాంగ్రెస్ త‌దిత‌ర పార్టీలు మాత్రం ఒకే ద‌ఫా ఎన్నిక‌లు దేశ‌మంతా సాధ్యం కాద‌ని పేర్కొంది. ఒకేసారి దేశ వ్యాప్తంగా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం ద్వారా ఖ‌ర్చు త‌గ్గించుకోవ‌చ్చ‌ని బీజేపీ పేర్కొంది.

ఇదిలా వుండ‌గా ఆర్టికల్ 324A, 325 ప్రకారం ఓటర్ల జాబితా సవరణ తప్పనిసరి. జమిలి ఎన్నికలకు రెండంచల విధానం సిఫార్సు చేసింది. మొదట లోక్‌సభ‌తో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌నేది ఆలోచ‌న‌. మొదటి దశ పూర్తైన వంద రోజుల్లోపు ,రెండవ దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వ‌హించాల‌ని క‌మిటీ సిఫార్సు చేసింది.

ఏదేని కారణం చేత పార్లమెంట్ లేక అసెంబ్లీ నిర్ధారిత కాలపరిమితికన్నా ముందే రద్దు అయితే… మిగిలిన పదవీ కాలానికి మాత్రమే ఎన్నికలు జరగాలని రామ్‌నాథ్ కోవింద్ సిఫార్సు చేసింది. అయితే రాష్ట్రాల మ‌ద్ద‌తు అవ‌స‌రం వుంది. రాష్ట్రాలు ఏ మేర‌కు ఆమోదిస్తాయ‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

20 Replies to “జ‌మిలి ఎన్నిక‌ల‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం!”

  1. అంటే మన పార్టీనీ ఇంకా కాంగ్రెస్ లో కలిపేసే టైం వచ్చేసినట్టేనా GA….😂😂

  2. “రాష్ట్రాలు ఏ మేర‌కు ఆమోదిస్తాయ‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది.”

    గుజరాత్ కన్నా ముందర గుడ్డిగా ఆమోదించే ఆంద్ర ఉందిగా…!

  3. Well, not good and not bad either. I think instead of all states and central at once, half of the states should be at 2.5 years mark at halfway through.

    In this way it serves as a check and vent for peoples voice and they don’t have to wait for 5 years.

  4. “ఒకేసారి దేశ వ్యాప్తంగా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం ద్వారా ఖ‌ర్చు త‌గ్గించుకోవ‌చ్చ‌ని బీజేపీ పేర్కొంది”

    super … vvpat slips లెక్కించాలంటేనే తగినంత మంది సిబ్బంది లేరని తెల్ల ముఖం పెట్టే కేంద్రం; parliament తో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలు పెట్టాలంటేనే 7 దఫాలుగా అమలు చేసే ఎన్నికల సంఘం; అనేక రాష్ట్రాల్లో శాంతిభద్రతల సమస్యలకు తగినంత కేంద్ర బలగాలు అందువాటులో ఉండవు. ఇవన్నీ పెట్టుకొని జమిలి అంట.

  5. “ఏదేని కారణం చేత అసెంబ్లీ నిర్ధారిత కాలపరిమితికన్నా ముందే రద్దు అయితే… మిగిలిన పదవీ కాలానికి మాత్రమే ఎన్నికలు జరగాలని”

    అలా జరగకుండా చూసుకోవడానికి కేంద్రం అడుగులకు మడుగులోతే governors ఉండగా ఇంకా రద్దు సమస్య ఎందుకుంటుంది?

  6. అయినా బోడి 17A sectionn ని సవ్యంగా నిర్వచించడంలోనూ, వ్యవసాయ billss బాగావంతంగా ఆమోదింపజేసుకొని తర్వాత తిరోగమనం పట్టిన విషయంలోనూ, 370 రద్దు చేసి కూడా ఇంకా శాంతిభద్రతలు అదుపులోకి తేవడంలో సఫలీకృతజలవ్వని వారు ఇలాంటి దానిని తీసుకొచ్చినా న్యాయస్థానాలలో ఇరుక్కుపోవడమే!

  7. ప్రతీ ఏటా చదవడం, పరీక్షలు రాయడం కష్టం కాబట్టి విద్యార్థులకు పరిక్షలన్నీ రద్దు చేసి ఒకే సారి పరీక్ష పెట్టాలి, అన్నట్లుంది, ఒక్కసారి మనం పాస్ అయ్యాక పరీక్షలే రద్దు చేస్తేసరి అంటారేమో భవిష్యత్తు లో.

    ప్రజాస్వామ్య ప్రక్రియ మీద నమ్మకం ఉన్నవాళ్లెవరూ ఇలాంటి అరాచకవాదానికి వత్తాసు పలకరేమో, వీళ్లకి మరో గెలిచేపరిస్థితి లేదని తెలుసే ఇలాంటి వంకరమార్గాలు వెతుకుతున్నారు. మొన్న ఎన్నికలకే ఇది తమ పార్టీ మానిఫెస్టో వెళ్లి ఉండాల్సింది, జనాలు‌ వాత పెట్టి పంపేవాళ్లు‌ ఇంటికి.

  8. ఎన్నికలనేవి మన పరిపాలన మీద జరిగే పరీక్షలు లాంటివి, ప్రతీ సంవత్సరం ఇరవై శాతం రాష్ట్రలకు ఎన్నికలు జరిగేలా వ్యవస్థ ఉంటే ప్రజస్పందన ఎప్పటికప్పుడు తెలుస్తుంది, తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఒక సారి గెలిపించి, ఐదేళ్లు చేతులు కట్టుకుని కూర్చొండి, మాకు నచ్చినట్లు పరిపాలిస్తూ, ‌నచ్చినట్లు రూల్స్ మార్చుకుంటాం అంటే ఒప్పుకుంటారా..

    1. Hi Ranjit, agree that elections are kind of test. However do you think elections every year is good? Pretty much whole government spends time on elections like voter list, logistics, elections, counting etc there by bringing governance to halt for months at a time and they cannot really focus on anything else. Also election code is not conducive to people oriented services, either public or private business. A day ago, there was an article in news paper even big officers ate away as much election funds as possible to the tune of crores. Some didn’t pay booth level officers and some were so cheap they didn’t even provide food!

      So surely needs to control, but ‘every year’ pre-empties the actual purpose. Do you think half way mark would work instead? I mean 2.5 years of time is not long, so people don’t forget if it’s important.

      1. Yes Sir, I would definitely prefer 3 or 4

        intermediate elections in every five

        year term.Only general elections

        need nation wide logistics

        preparation, all intermediate state

        polls can be easily managed with

        state’s workforce. We need to

        empower ECI and appoint competent

        officers to run it neutrally. Please note

        our country had 3 general elections in

        3 years between 1996 to 1999 using

        paper bollots 25 years ago, so it won’t be difficult to conduct one general and one assembly election in each state every five years.

        I can clearly sense a vested interest behind this proposal, it will start here eventually go towards no elections or

        maybe a name sake elections in future leading to pseudo-democracy or autocracy.

  9. ఈ రాష్ట్రాలు ఉన్నంత వరకు ఈ వెధవ గొడవలు ఉంటాయి.. ముందు ఈ రాష్ట్రాలని రద్దు చేస్తే హాయిగా ఒక దేశం ఒక ఎన్నికే ఇక మిగిలేది.. ఎవడో బ్రిటిష్ వాడు వాడి స్వార్ధం కోసం సృష్టించిన ఈ వ్యవస్త అవసరం లేదు.. దేశంలో ఉన్న చైనా సౌదీ ప్రేమికులకి కూడా అది ఆమోగ్యం ఔతుంది…

  10. ఒక దేశం ఒక ఎన్నిక తరవాత.. చైనా లాగా ఒక దేశం ఒక పార్టీ అన్న దాని మీద దృష్టి పెడితే ఉత్తమం.. అప్పుడు మన దేశం కూడా చైనా కన్నా వేగంగా దూసుకుపోతుంది…

Comments are closed.