సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ డివై చంద్రచూడ్ పేరును సిఫార్సు చేశారు ప్రస్తుత సీజేఐ ఉదయ్ ఉమేష్ లలిత్. నవంబర్ 8న సీజేఐ లలిత్ పదవీ విరమణ చేయనున్నడంతో తన తదుపరి న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి అయిన చంద్రచూడ్ పేరును సిఫార్సు చేశారు. దీంతో జస్టిస్ డివై చంద్రచూడ్ దేశానికి 50 వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే ఆవకాశం ఉంది.
కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గత శుక్రవారం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తూ, తన తరుపరి న్యాయమూర్తి పేరును కోరుతూ అభ్యర్థించింది. దీంతో సీజేఐ డివై చంద్రచూడ్ పేరును సిఫార్సు చేశారు. ప్రతి సీజేఐ తన పదవీ విరమణ చేసే ముందు నూతన సీజేఐగా సీనియర్ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేస్తారు.
సీజేఐ లలిత్‌కు మూడు నెలల కంటే తక్కువ పదవీకాలం మాత్రమే ఉండగా, జస్టిస్ చంద్రచూడ్‌కు ఎక్కువ కాలం ఉంటుంది. నవంబర్ 10, 2024 వరకు రెండేళ్ల పాటు పదవిలో ఉండబోతున్నారు.