కశ్మీర్లో ఉగ్రదాడి జరిగిన తరువాత కాంగ్రెసు నాయకులు చాలామంది నోటికి పని చెబుతున్నారు. పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఈ ఉగ్రదాడిని అధిష్టానం ఖండించింది. పాకిస్తాన్పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించింది. అయినప్పటికీ నాయకులు ఆగడంలేదు. పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ నాయకుల వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా విమర్శస్తోంది. ఆ పార్టీకి వీరి వ్యాఖ్యలు అస్త్రాలుగా దొరికాయి.
పాకిస్తాన్ అండదండలున్న ఉగ్రవాదుల మారణకాండపై దేశ ప్రజలంతా ఆగ్రహంతో రగిలిపోతుంటే కాంగ్రెసు నాయకులు మాత్రం పాకిస్తాన్కు సపోర్టుగా మాట్లాడుతున్నారు. పార్టీ లైన్ దాటొద్దని, ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడొద్దని అధిష్టానం హెచ్చరించినా వినిపించుకునే పరిస్థితి లేదు. పాక్తో యుద్ధం అవసరం లేదని, ఆ దేశంతో శాంతి చర్చలు జరపాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చేసరికి మాట మార్చేసి సంజాయిషీ చెబుతున్న మాదిరిగా వివరణ ఇచ్చాడు.
‘అబ్బే…నేను అలా అనలేదు. నా ఉద్దేశం అది కాదు’ అంటూ ఏదో చెప్పాడు. సీఎం సిద్ద రామయ్యే పాక్ను సమర్థిస్తూ మాట్లాడేసరికి తాను కూడా అలాగే మాట్లాడాలనుకున్నాడేమో ఎక్సయిజ్ శాఖ మంత్రి ఆర్బీ తిమ్మాపూర్. పాక్కు మద్దతు ఇవ్వడంలో సీఎం కంటే రెండాకులు ఎక్కువే చదివాడు ఈయన. ‘ఉగ్రవాదులు పర్యాటకులను మతం అడిగి కాల్చలేదు’ అని అన్నాడు. ‘తుపాకీతో పేల్చే ఉగ్రవాది మతం అడుగుతాడా? అలా కాల్చుకుంటూ పోతాడంతే. ప్రాక్టికల్గా అలోచించండి’ అని మీడియాతో అన్నాడు. ఇంతటితో ఆగకుండా ఈ ఉగ్రదాడిని మతపరమైన అంశంగా మార్చడానికి కుట్ర జరుగుతోందని అన్నాడు.
కర్ణాటకలో పాలకులే ఇలా మాటాడటంతో అధిష్టానం ఇరుకున పడింది. ప్రజలు కాంగ్రెసు పార్టీపై ఆగ్రహించే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందించింది. పార్టీ మార్గదర్శకాలను కట్టుబడి ఉండాలని నేతలకు స్పష్టం చేసింది. అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేయవద్దంటూ పార్టీ నేతలకు అధిష్టానం క్లియర్ కట్‌గా చెప్పింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నేతలకు స్పష్టం చేసింది. అంతేకానీ.. ఎవరి నిర్ణయాలు వారు బాహటంగా చెప్పకూడదని అన్నది.
పహల్గాం దాడి వెనుక నిఘా వర్గాల వైఫల్యం ఉండొచ్చని, ఏ దేశం కూడా వంద శాతం ఇలా దాడులను పసిగట్టకపోవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ శశిథరూర్‌పై తీవ్రంగా స్పందించారు. థరూర్ కాంగ్రెస్‌లో ఉన్నారా? బీజేపీలో ఉన్నారా? అని ప్రశ్నించారు. ‘సూపర్ బీజేపీ మ్యాన్’గా మారేందుకు ప్రయత్నిస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా నాయకులు ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు.
ఛత్తీస్గఢ్లోని మాజీ ఎమ్మెల్యే యూడీ మింజ్ ఇండియా కనుక పాకిస్తాన్తో యుద్ధం చేస్తే ఇండియా ఓడిపోతుందని అన్నాడు. ఈ కామెంట్ దేశంలో దుమారం రేపింది. బీజేపీ భగ్గుమంది. పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేయాలని అంటున్నవారు ఈసారి పాకిస్తాన్తోపాటు చైనాతో కూడా పోరాడాల్సి ఉంటుందని, అలంటి పరిస్థితిలో భారత్ ఓటమి ఖాయమని తెలుసుకోవాలని మింజ్ అన్నాడు. యుద్ధాన్ని సమర్థిస్తున్నవారినందరినీ సరిహద్దులకు పంపాలని వ్యంగ్యంగా అన్నాడు.
ఆయన ఫేస్ బుక్ద్వారా పాకిస్తాన్కు మద్దతు ప్రకటించాడు. కాని తీవ్ర విమర్శలు వచ్చేసరికి తన ఫేస్ బుక్ను ఎవరో హ్యాక్ చేసి తప్పుడు పోస్టులు పెట్టారని , తాను క్షమాపణలు కోరుతున్నానని అన్నాడు. ఇక కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సైపుద్దీన్సోజ్సింధు నదీ జలాలు పాకిస్తాన్కు అత్యంత కీలకమని, కాబట్టి ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేయకుండా కొనసాగించాలని అన్నాడు. ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ చెబుతున్న మాటలను మనం నమ్మాలన్నాడు.
మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు విజయ్వాడెట్టివార్ ఉగ్రవాదులు మతం అడిగి కాల్పులు జరుపుతారా? దీనిపై సందేహాలు ఉన్నాయన్నాడు. అయినా ఉగ్రవాదులకు అంత సమయం ఉంటుందా? అని ప్రశ్నించాడు. కాంగ్రెసు అధిష్టానం మాత్రం నాయకులను కట్టడి చేయలేకపోతోంది. చివరకు నాయకుల వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని, వాటితో పార్టీకి సంబంధం లేదని తేల్చిపారేసింది.
sachindi khangress gorrelu
Central Home minister, chief minister of Maharashtra and some other ministers were resigned after Mumbai attack. Why there is accountability from home minister and doval about Pahalgam security failure?
Hyderabad pelulla tarvata evaraina rajeenama chesaraa?