Advertisement

Advertisement


Home > Politics - National

అధ్యక్ష ఎన్నిక ఆయన కొంప ముంచుతోంది

అధ్యక్ష ఎన్నిక ఆయన కొంప ముంచుతోంది

జోడు పదవులు తనకు ఏమాత్రం కష్టం కాదని.. అవసరం వస్తే మూడు పదవులు కూడా నిర్వహించగలనని.. ఈ 72  ఏళ్ల వృద్ధ నాయకుడు తన శక్తి సామర్థ్యాల గురించి చాలా ఘనంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అతీగతీ లేకుండా పోతున్న పార్టీకి అధ్యక్ష హోదా దక్కుతుందనే ఆశ ఆయనను ఊరిస్తున్నప్పటికీ.. దానిని నమ్ముకుని ఉన్నది ఊడగొట్టుకునే ఆలోచన ఆయనకు లేదు. 

అయినా సరే అధ్యక్ష పదవి కోసం అనివార్యంగా తలపడవలసిన పరిస్థితి! ఆ ప్రయత్నంలో ఉన్నది ఓడిపోయే దుస్థితి!! రేపు పొద్దున రెంటికి చెడిన చందంగా మిగిలిపోక తప్పదేమో అని వెన్నాడుతున్న భయం!!! ఇది రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక గహ్లాత్ తాజా వ్యవహారం.

జోడు పదవులు.. మూడు పదవులు అంటూ బీరాలు పలికినప్పటికీ గహ్లాత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన అత్యాశలకు అధిష్టానం ఆశీర్వాదం లభించలేదు. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే సూత్రాన్ని పాటించి తీరాల్సిందే అని.. సాక్షాత్తూ.. పదవులు హోదాలతో నిమిత్తం లేని కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ స్పష్టం చేయడం అశోక్ గహ్లాత్ కు ఆశనిపాతం. దీంతో కాంగ్రెస్ పార్టీకి అక్టోబర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నిక- రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠం సచిన్ పైలట్ చేతికి చిక్కడానికి బాటలు తీరుస్తున్నట్లుగా కనిపిస్తోంది.

బహుశా ఈ దిశగా అధిష్టానంను ప్రసన్నం చేసుకోవడానికి అశోక్ గహ్లాత్ పదేపదే రాహుల్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలి అనే తాను కోరుతానంటూ చెపుతూ వస్తున్నారు. రాహుల్ అంగీకరించకపోతే మాత్రమే తాను అధ్యక్ష ఎన్నికల బరిలో ఉంటానని ఆయన చాలాసార్లు చెప్పారు. అధ్యక్ష పీఠం ఆయనకు ఏకగ్రీవంగా దక్కే అవకాశం లేదని తేలిపోయింది. శశిధరూర్ వంటి మేధావి సీనియర్ రాజకీయ నాయకులు కూడా దీనికోసం బరిలో పోటీ పడబోతున్నారు. రాహుల్ కూడా పోటీ చేస్తారో లేదో తెలియదు. ఈ నేపథ్యంలో అశోక గహ్లాత్ పరిస్థితి ఉన్నదీ పోయే ఉంచుకున్నదీ పోయే అనే సామెత చందంగా తయారవుతుందేమో అని కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

రాజస్థాన్లో ముఖ్యమంత్రి పీఠం కోసం అశోక గహ్లాత్- సచిన్ పైలెట్ మధ్య అప్రకటిత యుద్ధం చాలాకాలంగా నడుస్తోంది. ఇప్పుడు గల కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే సీఎం స్థానాన్ని సచిన్ పైలెట్ చేతిలో పెడతారని సహజంగా అందరూ భావిస్తున్నారు. ఆయనేమో రెండు పదవులు నేను సమర్థంగా నిర్వహించగలను నా దగ్గర అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని చెప్పుకున్నారు గాని ఆ పప్పులు ఉడికేలా లేదు.

కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికల్లో గెలిస్తే మాత్రమే సీఎం పీఠం ఊడుతుందా చర్చ కూడా నడుస్తోంది. ఒకవేళ అక్కడ ఓడిపోతే సీఎంగా కొనసాగుతారా అనే సందేహం పలువురిలో ఉంది. ఓడిపోయిన తర్వాత అధ్యక్షుడిగా కూడా గెలిచే జనాదరణకు దిక్కులేని నాయకుడికి సీఎం పీఠం ఎందుకు అనే విప్లవం రాజస్థాన్ కాంగ్రెసులో అంతర్గతంగా పుట్టినా ఆశ్చర్యం లేదు. ఇలా ఏ రకంగా చూసిన అశోక్ గహ్లాత్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా తయారైంది.

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను