దేశంలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకరంగా ఉంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,335 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 25,587కి పెరిగింది. నిన్న 4,435 కరోనా కేసులు నమోదవగా.. ఇవాళ 900 కేసులు ఎక్కువగా నమోదవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
గడచిన 24 గంటల్లో భారత్‌లో ఆరు మరణాలు నమోదయయ్యాయి.. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,929కి చేరుకుందని అధికారిక సమాచారం. నిన్నటి రోజులో మొత్తం 2,826 మంది కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల నుండి కోలుకున్నారు. దేశంలో కేరళలో అత్యధికంగా 8,229 యాక్టివ్ కేసులు ఉండగా.. ఆ తర్వాత మహారాష్ట్రలో ఎక్కువగా 3,874 ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కరోనా కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. కొత్త వేరియంట్ ప్రాణాంతకమైనది కాదంటున్నా.. మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అందువల్ల లైట్ తీసుకోవడం మంచిది కాదు. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు వాడటం మంచిది.