మహాయుతిలో ముసలం పుడుతుందా?

పరిస్థితులు వికటిస్తే గనుక.. శివసేన లేకుండా కూడా ఎన్సీపీ మద్దతుతో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుంది

ముఖ్యమంత్రి పదవి కోసం పడిన పీటముడి వలన మహాయుతిలో ముసలం పుడుతుందా? బిజెపి- శివసేన మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉన్నదా? అనే అనుమానాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ముఖ్యమంత్రిగా ఉన్న శివసేన నేత ఏక్‌నాథ్ షిండే, భాజపా తరఫున గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉన్న దేవేంద్ర ఫడణవీస్ ఇద్దరూ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగా పోటీపడుతున్నారు. కూటమి చీలికను ఎవ్వరూ కోరుకోవడం లేదు గానీ.. అనివార్యమైన పరిస్థితి వస్తే.. ఆ సంభావ్యతను తోసిపుచ్చలేమని పరిశీలకులు భావిస్తున్నారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అత్యధికంగా 132 సీట్లలో విజయం సాధించింది. మహాయుతి కూటమిలో కూడా వారి వాటా ఎక్కువ. కాబట్టి వారికే ముఖ్యమంత్రి పదవి దక్కాలనేది పలువురి వాదన. ఏక్‌నాధ్ షిండేకు ఒక అవకాశం ఇచ్చారు గనుక.. ఇప్పుడు ఆయన కూడా అవకాశం బిజెపికి ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని కొందరు అంటున్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఫడణవీస్ కు ఉన్నదని ఆ పార్టీ వారు గట్టిగా పట్టుపడుతున్నారు.

అయితే శివసేన వాదన ఇంకో రకంగా ఉంది. ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉండగా తీసుకున్న నిర్ణయాలు, అందించిన సుపరిపాలన కారణంగానే మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిందని, ఆ వియాన్ని తోసిపుచ్చలేమని వారు అంటున్నారు. కాబట్టి షిండేనే కొనసాగించాలనేది వారి వాదన.

షిండేని పక్కకు తప్పిస్తే గనుక.. భారతీయ జనతా పార్టీ మిత్ర పక్షాలను వాడుకుని, తాము బలపడిన తర్వాత వారిని కరివేపాకులు వాడుకుని వదిలేస్తుందని అనేక మంది చేసే ఆరోపణలే నిజమౌతాయని వారు చెబుతున్నారు. తద్వారా బిజెపిని డిఫెన్సులోకి నెడుతున్నారు.

బలాబలాల ప్రకారంగా చూస్తే భారతీయ జనతా పార్టీకి 132 మంది సభ్యులున్నారు. అదే సమయంలో ఎన్సీపీకి ఉన్న బలం 41 స్థానాలు. శివసేన(షిండే) 57 స్థానాలలో గెలిచింది. పరిస్థితులు వికటిస్తే గనుక.. శివసేన లేకుండా కూడా ఎన్సీపీ మద్దతుతో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుంది.

అయితే అలాంటి నిర్ణయం భాజపాకు అపరిమితమైన చెడ్డపేరు తెచ్చిపెడుతుంది. వారి విశ్వసనీయత దెబ్బతింటుంది. అందుకే కేంద్రంలోని పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. షిండే, ఫడణవీస్ ఇద్దరూ గట్టిగా పట్టుపడుతున్నందువల్ల.. మంగళవారమే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావల్సి ఉండగా.. ఇంకా నిర్ణయం జరగలేదు. రాజీ కుదరకపోతే మైత్రిలో ముసలం పుడుతుందని కొందరు అంచనా వేస్తున్నారు.

12 Replies to “మహాయుతిలో ముసలం పుడుతుందా?”

  1. శివసేన(షిండే) – ముఖ్యమంత్రి ని చేయటం న్యాయం

    షిండేని పక్కకు తప్పిస్తే గనుక.. భారతీయ జనతా పార్టీ మిత్ర పక్షాలను వాడుకుని, తాము బలపడిన తర్వాత వారిని కరివేపాకులు వాడుకుని వదిలేస్తుందని అనేక మంది చేసే ఆరోపణలే నిజమౌతాయని వారు చెబుతున్నారు

  2. మన దేశం చైనా లాగా గొప్పగా ఎడగలి అంటే అక్కడి పద్దతి పాటించాలి.. ఒక దేశం ఒక పార్టీ ఒక రాజకీయం.. దేశం కోసమే రాజకీయం…

  3. Bjp need not worry about anyone since it knows how to win elections. Modi was reluctant for alliance in AP and he was indifferent in the first meeting. Later he understood how to win elections. So we will have one kootami government forever.

    1. They hav got 230 seats .NDA surviving because of TDP and Nitish .Kndly understand .POlitics is number game. offcourse shinde is greedy for asking CM post again

Comments are closed.