Advertisement

Advertisement


Home > Politics - National

నేడే నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం!

నేడే నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం!

నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం ఇవాళ‌ అట్టహాసంగా నిర్వహించనున్నారు.  ఉదయం ఏడున్నరకు ప్రారంభమయ్యే కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది.  పార్లమెంట్‌ ప్రారంభోత్సవాన్ని రెండు దశలుగా నిర్వహిస్తున్నారు. ఉదయం 7.30 గంటలకు పూజ కార్యక్రమం, 9.30 గంటలకు రాజదండం ప్రతిష్టాపన ఉంటాయి.

కాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహ్వానించనందుకు నిరసనగా పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవాన్ని తాము బహిష్కరిస్తున్నట్లు 20 విపక్ష పార్టీలు ఇప్పటికే ప్రకటించారు. మ‌రో వైపు బీజేపీతో స‌హా 25 పార్టీల నాయకులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. 2020లో ప్రధాని స్వయంగా శంకుస్థాపన చేశారు. ఈ రోజు ఆయ‌న చేతుల మీదు గానే ప్రారంభోత్స‌వం జ‌రుగుతోంది. 

కాగా పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా సెంగోల్‌ను స్పీకర్‌ కుర్చీ పక్కన ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 14 ఆగస్టు, 1947న, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మొదటిసారిగా ఈ సెంగోల్‌ను అందుకున్నారు. ఇది బ్రిటీష్ వారి చేతుల నుండి అధికార మార్పిడికి చిహ్నంగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు బ్రిటిష్‌ వారి నుంచి అధికార మార్పిడి బదిలీకి గుర్తుగా సెంగోల్‌ను బహూకరించినట్లు ఆధారాలేవీ లేవని కాంగ్రెస్‌ చెబుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?