Advertisement

Advertisement


Home > Politics - National

వేశ్యకు సీటు.. ఘాటుగా స్పందించిన కంగనా

వేశ్యకు సీటు.. ఘాటుగా స్పందించిన కంగనా

అందరూ ఊహించినట్టుగానే కంగనా రనౌత్ కు బీజేపీ టికెట్ ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లోని మండి సెగ్మెంట్ నుంచి బీజేపీ తరఫున కంగనా రనౌత్ బరిలో దిగనుంది. కంగనాకు టికెట్ ఇచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆమెపై విరుచుకుపడ్డాయి. ఇన్నాళ్లకు భజనకు ఫలితం దక్కిందంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

అయితే గంటలు గడిచేకొద్దీ ఈ ట్రోల్స్  వికృతరూపం దాల్చాయి. ఏకంగా కాంగ్రెస్ నాయకులు సుప్రియా శ్రీనాతే, కంగనాపై అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో కంగనా రనౌత్ రంగంలోకి దిగింది. విమర్శలపై ఘాటుగా స్పందించింది.

"నా 20 ఏళ్ల కెరీర్‌లో నేను అన్ని రకాల మహిళా పాత్రల్ని పోషించాను. క్వీన్‌లోని అమాయక అమ్మాయి పాత్ర నుండి ధాకడ్‌లోని సమ్మోహన గూఢచారి వరకు, మణికర్ణికలో ఒక దేవత నుండి చంద్రముఖిలోని దెయ్యం వరకు, రజ్జోలోని వేశ్య నుండి తలైవిలో విప్లవ నాయకురాలి పాత్రవరకు ఇలా ఎన్నో రోల్స్ పోషించాను. మనం మన మహిళల్ని, ఈ పక్షపాత సంకెళ్ల నుంచి విడిపించాలి, వారి శరీర భాగాలపై చేసే విమర్శల నుంచి సమాజాన్ని బయటకు తీసుకురావాలి. మరీ ముఖ్యంగా సెక్స్ వర్కర్లను ఏదో ఒక రకంగా కించపరచడం, దూషించడం మానుకోవాలి."

ఇలా తనదైన శైలిలో ఘాటుగా స్పందించింది కంగనా. దీనిపై వెంటనే కాంగ్రెస్ నేత సుప్రియా రియాక్ట్ అయ్యారు. తన ఎకౌంట్ ను ఎవ్వరో హ్యాక్ చేశారని, తను మహిళలపై అలాంటి అభ్యంతరక వ్యాఖ్యలు చేయనంటూ ప్రకటించారు.

అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చాలామంది పోస్టులు పెట్టడం, అదే టైమ్ లో కంగనాకు మద్దతు తెలపడం చకచకా జరిగిపోయాయి. ప్రతి మహిళకు వ్యక్తిగత గౌరవం ఇవ్వాలని, అలా గౌరవం పొందే అర్హత ప్రతి స్త్రీకి ఉంటుందని, అలాంటి గౌరవం అందించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి లేదంటూ దుమ్మెత్తిపోస్తున్నారు కొంతమంది.

సోషల్ మీడియాలో కంగనా రనౌత్ చాలా స్ట్రాంగ్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమెకు చాలా బలమైన టీమ్ ఉంది. సుశాంత్ సింగ్ మరణం టైమ్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు ఆమె టీమ్ చాలా బలంగా స్పందించింది. అలాంటి కంగనాతో సోషల్ మీడియాలో నెగ్గాలనుకోవడం ఏ రాజకీయ నాయకుడికైనా తలకుమించిన భారమే అవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?