ఎన్నికల సంవత్సరంలో కొత్తవివాదాలు తలకు చుట్టుకోవడం ఏ రాజకీయ పార్టీకి కూడా ఇష్టం ఉండదు. అలాగని తమ ఓటు బ్యాంకు అస్తిత్వ పునాదులను మరింత పటిష్టం చేసుకునే ఆలోచన చేయకుండా ఏ ఒక్కరూ ఉండదు. ఇప్పుడు ప్రధాన నరేంద్ర మోడీ కూడా ఇదే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు.
ఎన్నికలు రాబోతున్న ప్రస్తుత తరణంలో పార్టీ నాయకులు ఏ రకంగా మాట్లాడాలో సోషల్ మీడియాలో సాగించే విస్తృత ప్రచారాలను ఏరకంగా ముందుకు తీసుకువెళ్లాలో ప్రధాన నరేంద్ర మోడీ దిశా నిర్దేశం చేశారు. కీలక విషయాలపై మాట్లాడేటప్పుడు పరువు పోకుండా జాగ్రత్తలు తీసుకోవడం గురించి, అలాగే ఆయా అంశాలపై మాట్లాడే మాటలు తమ పార్టీకి ఓటు బ్యాంకు ను మరింత పెంచేలా చేయడం గురించి వారు తపన పడుతున్నారు.
ప్రస్తుతానికి దేశంలో వేరే ఏ సమస్యలు లేనట్లుగా తమిళనాడు కు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే మాజీ సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్, సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు అందరూ అత్యంత సీరియస్ గా పట్టించుకుంటున్నారు. కులమతాలకు ప్రాధాన్యం ఇస్తున్న సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపు ఇచ్చారు. ఉదయనిది వ్యాఖ్యలపై యావత్తు దేశంలోని భారతీయ జనతా పార్టీ వందిమాగధులు స్పందిస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రతి ఒక్కరు ఆచితూచి మాట్లాడాలని ప్రధాన నరేంద్ర మోడీ హితోపదేశం చేస్తున్నారు.
మోడీ తీరు మరికొన్ని విషయాల్లో కూడా వారికి సందేహంగా ఉంది. ఇండియా అని అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న భారతదేశం యొక్క పేరును భారత్ అనే పేరు కిందికి మార్చబోతున్నారనే చర్చ కూడా దేశంలో హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఎలాంటి ఎజెండా అంశాలు చెప్పకుండా.. అయిదురోజుల పార్లమెంటు సమావేశాలకు ఏర్పాటుచేయడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనికి ప్రతికూలంగా విపక్షాలు, అనుకూలంగా అధికార పార్టీ ఎడాపెడా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఈ అంశంపై కూడా నోరు తెరచి మాట్లాడవద్దని క్షేత్రస్థాయిలోని పార్టీ కార్యకర్తలకు మోడీ హితోపదేశం చేశారు.
ఆయన తీరు గమనిస్తోంటే.. ‘మాటల్లేవ్.. చేతలు చేసుకుంటూ వెళ్లిపోవడమే!’ తాము తలచినదెల్లా చేసేయడమే అని మోడీ భావిస్తున్నట్లుగా ఉన్నది. ఆయన తీరును ప్రజాస్వామిక వ్యాదులు ఖండిస్తున్నారు.