Advertisement

Advertisement


Home > Politics - National

హైదరాబాద్ లో రూ.2వేల నోట్లు కష్టాలు

హైదరాబాద్ లో రూ.2వేల నోట్లు కష్టాలు

రూ.2వేల నోట్ల ఉపసంహరణ మొదలైంది. ఎప్పుడైతే ఈ ప్రక్రియ మొదలైందో, అలా మార్కెట్లోకి వెల్లువలా 2వేల రూపాయల నోట్లు బయటకొస్తున్నాయి. దాదాపు సామాన్యుడికి దూరమైన 2వేల రూపాయల నోటు ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో 2వేల రూపాయల నోట్ల వర్షం కురుస్తోంది.

ఏ పెట్రోల్ బంక్ కు వెళ్లినా 2వేల నోట్లు కనిపిస్తున్నాయి. పెద్ద షాపింగ్ మాల్స్ లో 2వేల నోట్ల ప్రవాహం కనిపిస్తోంది. ఇన్నాళ్లూ ఎక్కడెక్కడో దాగిన నోట్లు అన్నీ విపణిలోకి వచ్చేస్తున్నాయి. దీంతో సామాన్యులకు చిల్లర సమస్యగా మారింది. ఫలితంగా నగరంలోని చాలా బంకుల్లో, షాపింగ్ మాల్స్ లో కొత్త రూల్స్ దర్శనమిస్తున్నాయి.

కనీసం వెయ్యి రూపాయల పెట్రోల్ కొట్టించుకుంటేనే 2వేల రూపాయలకు చిల్లర ఇస్తామంటున్నాయి బంకులు. అటు షాపింగ్ మాల్స్ లో కూడా ఇదే తరహా రూల్స్ కనిపిస్తున్నాయి. 100, 200 రూపాయల సరుకులు కొని 2వేల నోటు ఇస్తే తిరస్కరిస్తున్నారు వ్యాపారులు. వెయ్యి రూపాయలకు అటుఇటుగా షాపింగ్ చేస్తేనే చిల్లర ఇస్తున్నారు.

మరోవైపు 2వేల నోటు చుట్టూ కొత్త ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. 2వేల రూపాయల నోట్లు ఇక్కడ తీసుకుంటాం అంటూ చాలా షాపుల్లో బోర్డులు కనిపిస్తున్నాయి. మరోవైపు చాలా వస్త్ర దుకాణాల్లో 'బై టు గెట్ వన్' ఆఫర్లన్నీ 2వేల రూపాయల చుట్టూనే తిరుగుతున్నాయి.

మరోవైపు పెద్ద నోట్ల మార్పిడి కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని బ్యాంకుల క్యాష్ డిపాజిట్ మెషీన్లలో 2వేల రూపాయల నోట్లు తీసుకోవడం లేదు. ఇక ముత్తూట్ ఫైనాన్స్ కు చెందిన కొన్ని బ్రాంచీల్లో 2వేల రూపాయల నోటును తిరస్కరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు కెనరా బ్యాంక్ కు చెందిన కొన్ని బ్రాంచీల్లో ఫారమ్ నింపిన తర్వాతే పెద్ద నోట్లను ఎక్స్ ఛేంజ్ చేస్తున్నారు. చాలా బ్యాంకుల్లో చిల్లర లేదు, ఎకౌంట్ లో డిపాజిట్ చేసుకోమని సూచిస్తున్నారు బ్యాంక్ సిబ్బంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?