రేపట్నుంచి ఈ కొత్త మార్పులు

నవంబర్ నెలలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టెలికం, బ్యాంకింగ్ నుంచి రైల్వే వరకు పలు రంగాల్లో మార్పుచేర్పులు జరుగుతున్నాయి. Advertisement రేపట్నుంచి ప్రతి మొబైల్ కు వచ్చే మెసేజ్ ను టెలికం కంపెనీలు…

నవంబర్ నెలలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టెలికం, బ్యాంకింగ్ నుంచి రైల్వే వరకు పలు రంగాల్లో మార్పుచేర్పులు జరుగుతున్నాయి.

రేపట్నుంచి ప్రతి మొబైల్ కు వచ్చే మెసేజ్ ను టెలికం కంపెనీలు ట్రాక్ చేయాలి. ఈ మేరకు ట్రాయ్ సరికొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. స్పామ్ ను నియంత్రించేందుకు ట్రాయ్ ఈ రూల్ తెచ్చిపెట్టింది. ఇలా చేయడం వల్ల స్పామ్ కు మూలాన్ని గుర్తించడంతో పాటు, అరికట్టడం సులభం అవుతుంది. వినియోగదారుడికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

ఇక బ్యాంకింగ్ కు సంబంధించి ఆర్బీఐ కొన్ని కొత్త నిబంధనలు జోడించింది. దేశీయంగా చేసే ఆన్ లైన్ మనీ ట్రాన్సఫర్లకు సంబంధించి బ్యాంకర్లకు కొన్ని అదనపు మార్గదర్శకాల్ని జోడించింది. ఎక్కువగా ఆన్ లైన్ పేమెంట్స్ మొబైల్ ఫోన్ల నుంచి జరుగుతున్న నేపథ్యంలో, ఆర్బీఐ ఈ అదనపు భద్రతా చర్యలకు ఉపక్రమించింది. రేపట్నుంచి మొబైల్ లో ఆన్ లైన్ బ్యాంకింగ్, యూపీఐ సేవల్లో భద్రత ఇంకాస్త పెరుగుతుంది.

ట్రైన్ టికెట్లకు సంబంధించి కూడా కొత్త రూల్స్ రేపట్నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇప్పటివరకు అడ్వాన్స్ రిజర్వేషన్ సిస్టమ్ 120 రోజుల పీరియడ్ లో పనిచేసేది. దీన్ని అమాంతం 60 రోజులకు కుదించారు. ఇకపై రైళ్లలో అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకోవాలంటే 2 నెలల ముందు మాత్రమే సాధ్యం.

ఎప్పట్లానే నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ల ధరల్లో సవరణలు ఉండబోతున్నాయి. ఈసారి గృహావసరాల కోసం వినియోగిస్తున్న సిలిండర్ ధరల్లో మార్పులు ఉండవని తెలుస్తోంది. వాణిజ్య అవసరాల కోసం వాడుతున్న సిలిండర్ల ధరల్లో మాత్రం సవరణలు చోటుచేసుకోబోతున్నాయి.

ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు రేపట్నుంచి కొత్త రూల్స్ వర్తిస్తాయి. కొన్ని రకాల కార్డులపై నెలవారీ ఫైనాన్స్ ఛార్జీల కింద 3.75శాతం సర్ ఛార్జీ విధించబోతున్నారు. అంతేకాదు, ఇకపై ఒక నెలలో కార్డు వినియోగం 50వేలు దాటితే ఒక శాతం ఛార్జీ కూడా విధించబోతున్నారు. ఇది మాత్రం డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.

అటు ఐసీఐసీఐ బ్యాంకింగ్ లో కూడా మార్పుచేర్పులు జరిగాయి. చాలా కార్డులపై నవంబర్ 15 నుంచి రివార్డ్ పాయింట్స్ తగ్గబోతున్నాయి. చాలా కార్డుల నుంచి స్పా బెనిఫిట్స్ ను ఉపసంహరించుకున్న బ్యాంక్.. అదే సమయంలో లక్ష రూపాయలకు మించి కార్డు వాడే వినియోగదారులకు ఇంధన సర్ ఛార్జీ మినహాయింపు ఇవ్వడం లేదు.

2 Replies to “రేపట్నుంచి ఈ కొత్త మార్పులు”

Comments are closed.