లక్ష ద్వీప్ కు అదృష్టం పట్టింది

లక్షద్వీప్ కేంద్రంగా నడుస్తున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. మల్దీవులు ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలు, తదనంతర పరిణామాల నేపథ్యంలో లక్షద్వీప్ కు ఇప్పుడు అదృష్టం పట్టింది. Advertisement లక్షద్వీప్ లో…

లక్షద్వీప్ కేంద్రంగా నడుస్తున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. మల్దీవులు ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలు, తదనంతర పరిణామాల నేపథ్యంలో లక్షద్వీప్ కు ఇప్పుడు అదృష్టం పట్టింది.

లక్షద్వీప్ లో భారీగా పెట్టుబడులు పెట్టాలని టాటా గ్రూప్ నిర్ణయించింది. అక్కడ రెండు బ్రాండెడ్ రిసార్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. టాటా గ్రూప్ కు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ, గతేడాది జనవరిలోనే లక్షద్వీప్ లో రెండు తాజ్ గ్రూప్ హోటల్స్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకుంది.

ఇప్పుడా ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని టాటా ప్రకటించింది. 2026 నాటికి రిసార్టులు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. లక్షద్వీప్ లోని సుహేలిలో 110 గదులతో 60 విల్లాలు, 50 వాటర్ విల్లాల్ని మరో రెండేళ్లలో అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది టాటా గ్రూప్.

అదే విధంగా కద్మత్ దీవిలో 110 గదుల హోటల్, మరో 75 బీచ్ విల్లాలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. వసతులతోపాటు.. స్కూబా డైవింగ్, విండ్ సర్ఫింగ్, వాటర్ స్కీయింగ్ లాంటి ఎన్నో సదుపాయాల్ని కల్పిస్తామని తెలిపింది.

27 ద్వీపాల సమాహారం లక్షద్వీప్. తాజా వివాదంతో ఇప్పుడీ టూరిస్ట్ స్పాట్ వైపు లక్షలాది మంది ఆకర్షితులవుతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా లక్షద్వీప్ టూరిజం కోసం ప్రత్యేక రాయితీలు ఇవ్వబోతోంది. చూస్తుంటే.. లక్ష ద్వీప్ కు అదృష్టం పట్టినట్టే ఉంది. ప్రస్తుతం ఇక్కడ 17 దీవుల్లో మాత్రమే ప్రజలు నివశిస్తున్నారు. మిగతా దీవులన్నీ ఖాళీగానే ఉన్నాయి.