పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ప్రశాంత్ కిషోర్!

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ త్వరలో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారబోతున్నారు. అక్టోబర్ 2న బీహార్‌లో తన రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ రోజునే పార్టీ పేరు, నాయకత్వం వంటి…

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ త్వరలో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారబోతున్నారు. అక్టోబర్ 2న బీహార్‌లో తన రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ రోజునే పార్టీ పేరు, నాయకత్వం వంటి అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.

ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే బీహార్‌లో జన సురాజ్ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన పార్టీకి తానే నాయకత్వ బాధ్యతలు తీసుకోనని, ప్రజలే నాయకత్వం వహించాలన్నారు. 60% బీహార్ ప్రాంతాలను పాదయాత్ర ద్వారా పూర్తి చేసినట్లు చెప్పారు. కొత్త పార్టీ ఏర్పాటుకు తర్వాత కూడా పాదయాత్ర కొనసాగుతుందని, మరో ఏడాది లేదా రెండేళ్ల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. 2025 ఫిబ్రవరి లేదా మార్చిలో రెండో దశ యాత్ర ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పారు.

ప్రశాంత్ కిషోర్ గతంలో బీజేపీ, వైయస్ జగన్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వంటి నేతలకు వ్యూహాలు రూపొందించి విజయాలకు దోహదం చేశారు. ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టి బీహార్‌లో విజయం సాధిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.  ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు, ప్రశాంత్ కిషోర్ పలు మార్లు చంద్రబాబుతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. తెలుగు దేశం పార్టీ తో ఆయన దగ్గరగా ఉన్న సమయంలో, మీడియా ఛానెల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పిన విష‌యం తెలిసిందే. ఆయ‌న చెప్పిన వైసీపీ ఘోరంగా ఓడిపోయింది.

ఇప్పుడు, ఆయన స్వయంగా బీహార్‌లో రాజకీయ పార్టీ ప్రారంభిస్తుండటంతో, ఈ వ్యూహకర్తగా ఉన్న అనుభవాన్ని తన రాజకీయ కెరీర్‌లో ఎలా మారుస్తారో చూడాల్సి ఉంది. ఎన్ని సలహాలు ఇచ్చినా, స్వంత పార్టీ పెట్టి, ప్రత్యక్ష రాజకీయ పోరాటంలో విజయాన్ని సాధించడం సవాళ్లతో కూడిన విషయం అని తెలిసిదే.

3 Replies to “పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ప్రశాంత్ కిషోర్!”

Comments are closed.