వరవరరావుకు బెయిల్‌!

భీమా కోరేగావ్ కేసులో నిందితుడుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌, సామాజిక కార్యకర్త వరవరరావుకు వైద్య కారణాలతో భారత అత్యున్నత న్యాయస్థానం బుధవారం ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్ మంజూరు చేసింది.  Advertisement బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి…

భీమా కోరేగావ్ కేసులో నిందితుడుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌, సామాజిక కార్యకర్త వరవరరావుకు వైద్య కారణాలతో భారత అత్యున్నత న్యాయస్థానం బుధవారం ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్ మంజూరు చేసింది. 

బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి లలిత్ నేతృత్వంలో కూడిన‌ ధర్మాసనం ఆయన స్వేచ్ఛను ఏ విధంగానూ దుర్వినియోగం చేయరాదని పేర్కొంది.

శాశ్వత వైద్య బెయిల్ కోసం తన పిటిషన్‌ను తిరస్కరించిన బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేసిన 83 ఏళ్ల వ‌ర‌వ‌రరావు ప్రస్తుతం వైద్య కారణాలతో మధ్యంతర బెయిల్‌పై ఉన్నాడు. జూలై 12న కోర్టులో లొంగిపోవాల్సి ఉంది. తాజ‌ సుప్రీంకోర్టు తీర్పుతో ఆయ‌న ఊరట లభించింది.

గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు సాగించిన కుట్ర‌లో భాగం అయ్య‌ర‌ని ఆరోపిస్తూ వ‌ర‌వ‌ర‌రావు తో పాటు సామాజిక కార్య‌క‌ర్త‌ల‌ను, మేధావుల‌ను ఎన్ఐఊ అరెస్ట్ చేసింది.