ప్రస్తుతం దేశంలో రాజకీయాలు మొత్తం ఉదయనిధి స్టాలిన్ మాటల చూట్టే తిరుగుతున్నాయి. సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ సోషల్ మీడియా వేదికగా ఆయనకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడిపిస్తుంటే.. మరోవైపు స్వామీజీలు ఉదయనిధి స్టాలిన్‌కు వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఆ వార్నింగ్‌లకు ఆయన కూడా అదే రితీలో సమాధానం ఇస్తునే ఉన్నారు.
తాజాగా అయోధ్యకు చెందిన పరంధాస్ ఆచార్య అనే స్వామిజీ మాట్లాడుతూ.. ఉదయనిధి స్టాలిన్ తల నరికివేసేవారికి 10 కోట్ల రూపాయల బహుమతిని ప్రకటించారు. తాను రూ. 500 కోట్ల యజమానిని అంటూ చెప్పకుంటూ.. ఒక చేతిలో ఉదయనిధి పోస్టర్‌ను, మరో చేతిలో కత్తిని పట్టుకుని, డీఎంకే మంత్రిని సింబాలిక్ శిరచ్ఛేదం చేస్తున్న దృశ్యాన్ని చూపించే వీడియోను విడుదల చేశాడు.
ఆ వీడియోపై ఉదయనిధి స్పందిస్తూ, “ఈరోజు ఒక స్వామిజీ నా తలపై రూ. 10 కోట్ల బహుమానం ప్రకటించాడు. ఉదయనిధి తల నరికితే రూ. 10 కోట్లు ఇస్తానని చెప్పాడు. అతను నిజమైన సాధువా లేదా డూప్లికేట్ సాధువా? నీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నా జుట్టు దువ్వుకోవడానికి రూ. 10 కోట్లు ఎందుకు ప్రకటిస్తున్నావు? రూ. 10 దువ్వెన ఇస్తే నేనే చేస్తాను.” అంటూ వెటకరించారు.
కాగా సనాతన ధర్మంపై తాను చేసిన ప్రకటనపై ఉదయనిధి గట్టిగా నిలబడి.. హిందూ సమాజాన్ని లక్ష్యంగా తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు.