అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాలో అధ్యక్షుడి మానసిక స్థితిపై, అతడి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే ఎన్నో కథనాలొచ్చాయి. ఇప్పుడవి మరింత ఎక్కువయ్యాయి. తాజాగా జరిగిన కొన్ని ఘటనలు ఈ ఊహాగానాలకు కారణమయ్యాయి.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. “అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఎక్కడ?” అనే ప్రశ్న సోషల్ మీడియాను ఊపేస్తోంది. కొన్ని రోజులుగా బైడెన్ కనిపించకపోవడంతో కొంతమంది రెచ్చిపోతున్నారు. తమ వ్యాఖ్యలతో కాక రేపుతున్నారు. బైడెన్ అదృశ్యం.. సోషల్ మీడియాలో ఇప్పుడో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
అమెరికా అధ్యక్ష పదవికి జరగబోయే పోటీ నుంచి బైడెన్ వైదొలిగారు. తన పదవీ కాలం పూర్తయ్యేంత వరకు అధ్యక్షుడిగా కొనసాగుతానని, అదే తన పార్టీకి, దేశానికి కూడా మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ వెంటనే కమలా హారిస్ కు ఆయన మద్దతు పలికారు.
కమలా హారిస్ ను డెమక్రాట్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత, బైడెన్ మళ్లీ కనిపించలేదు. దీనికి కారణం ఆయనలో కొవిడ్ లక్షణాలు కనిపించడమే. కానీ సోషల్ మీడియా మాత్రం హోరెత్తిపోతోంది. ‘వేర్ ఈజ్ జో’ అనే హ్యాష్ ట్యాగ్ నిమిషాల్లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. బైడెన్ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, ఈ రాత్రి గడవడమే కష్టంగా ఉందంటూ పోస్టులు పడ్డాయి.
దీంతో వైట్ హౌజ్ వెంటనే స్పందించింది. అధ్యక్షుడు కరోనా లక్షణాలతో బాధపడిన మాట వాస్తవమేనని, ఇప్పుడా లక్షణాల నుంచి కూడా ఆయన బయటపడ్డారని తెలిపింది. ప్రస్తుతం అధ్యక్షుడు తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపింది.
దీంతో ఇన్ని రోజులుగా బైడెన్ పై నడుస్తున్న ప్రచారానికి అధికారులు ఫుల్ స్టాప్ పెట్టారని అనుకోవాలి. కానీ ఈ పుకార్లకు పూర్తిస్థాయిలో తెరపడాలంటే బైడెన్ బయటకు రావాలి. త్వరలోనే అది జరగాలని కోరుకుందాం..
5 years tadepalli palace lo oka NATHI PAKODI gaadu bayataki raakundaa press meets pettakundaa state ni ma*** kudipistunnappudu kooda ilaanti article rayavalasindi GA.. ” WHERE IS TUGLAK JAGLAK?” ani
విజయమ్మ మొన్నటిదాకా అమెరికాలో ఉంది వచ్చింది కదా ఏమి చేసిందో ఎవరికీ తెలుసు ?
వి!జ!య!మ్మ మొన్నటిదాకా అమెరికాలో ఉంది వచ్చింది కదా ఏమి చేసిందో ఎవరికీ తెలుసు ?
she must have spent her time with her grandson…he’s not like her granddaughters