కెనడాలో వైఎస్ఆర్సీపీ NRI సభ్యుల ఆత్మీయ సమావేశం

కెనడా టొరొంటో నగరంలో నవంబర్ 5వ తేదీన (ఆదివారం) మిస్సిసాగా పట్టణంలో వైయస్సార్సీపి కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. దీనికి కెనడాలోని డా. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరియు సీయం శ్రీ జగన్ గారిని…

కెనడా టొరొంటో నగరంలో నవంబర్ 5వ తేదీన (ఆదివారం) మిస్సిసాగా పట్టణంలో వైయస్సార్సీపి కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. దీనికి కెనడాలోని డా. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరియు సీయం శ్రీ జగన్ గారిని అభిమానించే తెలుగు వారు హాజరయ్యారు.

వైఎస్ఆర్సీపీ కెనడా అడ్వైజర్ డా. గరిశ జగన్మోహన్ రెడ్డి, కన్వీనర్ వేణు చుక్కలూరు మరియు వైఎస్సార్సీపీ గ్లోబల్ కన్వీనర్ శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి సమన్వయ సహకారాలతో, కెనడా కార్య వర్గ సభ్యుల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ NRIల ఆత్మీయ సమావేశం ఒక పండుగలా జరిగిన ఈ సమావేశానికి అమెరికా నుంచి వైఎస్ఆర్సీపీ కన్వీనర్లు అయిన శ్రీ కె.వి రెడ్డి, శ్రీ కోరసాపాటి శ్రీధర్ రెడ్డి( నాటా ప్రెసిడెంట్ )శ్రీ వాసుదేవ రెడ్డి, శ్రీ రమేష్ రెడ్డి మొదలైన ప్రముఖులందరూ స్వయంగా వచ్చి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు తదితరులు జూమ్ కాల్ ద్వారా సమావేశంలో ప్రసంగించారు.

కెనడా కన్వీనర్ వేణు చుక్కలూరు గారు వేదిక మీదికి అమెరికా నుంచి వచ్చిన అతిధులను ఆహ్వానించి సభ ప్రారంభించాడు. అలాగే వైసిపి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి ఎందుకు రావాలో వివరించారు.

ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి బారినపడి చిన్నాచితక వ్యాపారాలు దెబ్బతిని అనేకమంది పేదరికంలోకి చేరారు. అలాంటి పేదవారిని కోవిడ్ సమయంలోనే కాక, ఇప్పటికీ ఆదుకుంటున్న సంక్షేమ, సాధికారిక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అని తెలిపారు. తన మ్యానిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి, నవరత్నాలను 99% అమలు చేసి పేదరికాన్ని పారద్రోలి 31 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు అందజేసిందని తెలిపారు.

ఇప్పటివరకు జగనన్న ప్రభుత్వం 67,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 127 పెద్ద పరిశ్రమలు, 85,000 ఉద్యోగాలు కల్పించినట్లు పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా మాట్లాడుతూ తెలిపారు. ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు వైజాగ్ లో కార్యాలయాలు మొదలుపెట్టడం ప్రభుత్వ ప్రతిభకు నిదర్శనం. ఏపీ లో పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తోందని….ఎన్నారైలు కూడా ఏపీ లో కొత్త సంస్థలు ప్రారంభించాలని, అలాగే ఉన్న సంస్థలను విస్తరించాలని కోరారు.

శాప్ అధ్యక్షులు శ్రీ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి మాట్లాడుతూ విదేశాల్లో ఉంటున్నవారు తమ ప్రాంత అభివృద్ధి కోసం పరితపిస్తూ, తమ సొంత గ్రామాలకు, మాతృ రాష్టానికి సాయం చేయాలనే NRI ల తపనను ఆయన అభినందించారు. పచ్చమీడియాని ఎదుర్కొని నిజాలు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలిపాలని కోరారు.

ప్రతి రంగంలోనూ అభివృద్ధికి బాట వేస్తూ, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్న ప్రభుత్వం మనది. 2019లో అందరం కష్టపడి పార్టీని గెలిపించి శ్రీ జగన్ గారిని ముఖ్యమంత్రిని చేశాము. ఇప్పుడు జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని ప్రతి ఇంటికి తెలియజేసి మరిన్ని ఎక్కువ సీట్లతో, మెజారిటీతో ప్రభుత్వాన్నిమళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చేలా ప్రతి ఒక్కరం కృషి చేయాలని ఎన్నారై గ్లోబల్ అడ్వైజర్ శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి NRIలను కోరారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి (నార్త్ అమెరికా) రత్నాకర్ గారు జగన్ గారు ప్రజల కోసం ప్రభుత్వం పడుతున్న తపన గురించి వివరించారు. ప్రభుత్వ అడ్వైసర్ చల్ల మధు గారు జగన్ కనెక్ట్స్ తరుపున మాట్లాడారు.

యూఎస్ కన్వీనర్ కేవీ రెడ్డి గారు మాట్లాడుతూ.. ప్రభుత్వం 4.69 లక్షల కోట్ల రుపాయలను సంక్షేమం ద్వారా పేద ప్రజలకు అందించిందని, ఇలాంటి సంక్షేమం ఇలాగే కొనసాగాలంటే “మళ్లీ రావాలి మన జగన్ “ అనే నినాదం తో ఆడిటోరియంను హోరెత్తించారు.

మరో యూఎస్ కన్వీనర్ దోసపాటి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం మనబడి – నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూల్స్ లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం మనందరికీ తెలుసన్నారు. ప్రతి NRI తమ సొంత గ్రామాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

ఎన్నారై మెడికల్ అఫైర్స్ అడ్వైజర్ వాసుదేవ రెడ్డి గారు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో ఇప్పటికే 17 కొత్త మెడికల్ కాలేజీలు, 10వేల వైయస్సార్ క్లినిక్ లు, ప్రతి మండలానికి రెండు పీ.హెచ్.సి లు కోసం 16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం గురించి వివరించారు. గుండెపోటు వచ్చిన ఒక గంటలో వేయవలసిన 40 వేల రూపాయలు ఇంజక్షన్ జగనన్న ప్రభుత్వం పేదలందరికీ ఉచితంగా ఇస్తుంది అని తెలిపారు.

ఇంకో యూఎస్ కన్వీనర్ రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం నాలుగేళ్లలో 2.58 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.

ఇంకో 6 నెలల్లో రాబోతున్న ప్రభుత్వ ఎన్నికల్లో *“వై నాట్ 175”* అన్న నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు.

పోయిన సంవత్సరం ఆక్సిడెంట్ లో మృతి చెందిన ఏపీ ఎన్నార్టీ సభ్యుడు రామ్ పిరకాల గారికి నివాళి అర్పించి సభలో ఒక నిమిషం మౌనం పాటించారు. తర్వాత తన్వి ,శాన్వి ,అవని,జనని , కీర్తి , మేధ మొదలైన చిన్నారులు తమ నృత్య ప్రదర్శన ద్వారా ఆహుతులను ఆకట్టుకున్నారు. చిన్నారుల ఆట పాటలతో, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో, కమ్మని విందు బోజనముతో ఈ కార్యక్రమము ఆద్యంతం ఆహ్లాదబరితంగా సాగింది.

ఈ కార్యక్రమము విజయవంతం అవడానికి కృషి చేసిన కార్యవర్గ సభ్యులు మరియు వాలంటీర్ లను నిర్వాహకులు అభినందించారు.