‘ఇండియాకు పంపిస్తే ఆత్మహత్య చేసుకుంటా’

పీఎన్ బీ స్కామ్ సూత్రధారి, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ యూకే కోర్టులను బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఉన్నాడు. భారీ ఎత్తున పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి అప్పులు  తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పరార్…

పీఎన్ బీ స్కామ్ సూత్రధారి, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ యూకే కోర్టులను బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఉన్నాడు. భారీ ఎత్తున పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి అప్పులు  తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పరార్ అయ్యాడు ఈ నీరవ్ మోడీ. చివరకు యూకేలో తేలాడు.

భారత ప్రభుత్వ విన్నపం మేరకు నీరవ్ మోడీపై యూకేలో చట్టపరమైన చర్యలు మొదలయ్యాయి. కొన్నాళ్లుగా అతడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ అతడు  తాజాగా మరోసారి యూకే కోర్టును కోరాడు. అయితే అందుకు ఆ న్యాయస్థానం తిరస్కరించింది.

తనను హౌస్ అరెస్ట్ చేయాలని, భారీగా పూచికత్తును సమర్పించడానికి కూడా రెడీగా ఉన్నట్టుగా అతడు కోర్టుకు విన్నవించుకున్నాడు. అయినా కోర్టు బెయిల్ కు నిరాకరించింది. ఇలాంటి నేఫథ్యంలో నీరవ్ మోడీ తనను ఇండియాకు పంపవద్దని కూడా కోర్టును  కోరాడు. ఒకవేళ కోర్టు తనను ఇండియాకు పంపించాలని తీర్పును ఇస్తే.. తను ఆత్మహత్య చేసుకొంటానంటూ అతడు న్యాయమూర్తికి చెప్పాడట.

ఇండియాలో విచారణ మీద తనకు నమ్మకం లేదని, అందుకే తను ఆ దేశానికి వెళ్లదలుచుకోలేదని.. అందుకు భిన్నంగా కోర్టు తనను ఇండియాకు పంపితే.. ఆత్మహత్య చేసుకోవడమూ అంటూ అతడు బ్లాక్ మెయిలింగ్ కు దిగడం గమనార్హం.