రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విపరీత ధోరణులకు తెగబడి పదవి పోగొట్టుకున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ….ఇక ఆ పదవి అందని ద్రాక్షేనా? అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఈసీగా మొదటి నుంచి పక్షపాత ధోరణితో నిర్ణయాలు తీసుకుంటున్న నిమ్మగడ్డ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. నిన్నటికి నిన్న హైకోర్టు తీర్పు తనకు అనుకూలంగా వచ్చిందనే సాకుతో ప్రదర్శించిన దూకుడు మరోసారి ఆయన నైజాన్ని ఎత్తి చూపింది.
తనకు తానుగా ఎస్ఈసీగా తన కార్యాలయం నుంచి సర్క్యులర్ జారీ చేయించడం, ఆ తర్వాత విజయవాడ నుంచి వాహనాలు పంపాలని ఆదేశించడం, స్టాండింగ్ కౌన్సిల్‌లో మార్పులు చేయాలని న్యాయవాదిని రాజీనామా చేయాలని ఆదేశించడం నిమ్మగడ్డ అహంకారానికి నిదర్శనమని చెబుతున్నారు. చివరికి ఆయన పునర్నియామకాన్ని జగన్ సర్కార్ రద్దు చేసింది.
ఈ నేపథ్యంలో న్యాయం కోసం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఏపీ సర్కార్ ఆశ్రయించింది. నిమ్మగడ్డను తిరిగి విధుల్లోకి తీసు కోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తే మాత్రం నిమ్మగడ్డకు శాశ్వతంగా ఎన్నికల సంఘం ద్వారాలు మూసుకు పోయినట్టే.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలోనే వాయిదా వేశారు. అసలు వివాదానికి బీజం పడింది కూడా ఇక్కడే. ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన పదవి ఖాళీగా ఉండకూడదన్న నియమాలను అనుసరించి ఎస్ఈసీగా మన్మోహన్ సింగ్‌ను నియమించే ఆలోచనలో జగన్ సర్కార్ ఉన్నట్టు సమాచారం. ప్రత్యేక సీఎస్ కేడర్‌లో మన్మోహన్‌సింగ్ పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సర్కార్ సీరియస్‌గా కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.