మార్చి 20 వ తేదీన నిర్భయ హంతకులకు సామూహిక ఉరి శిక్ష అమలు చేయాలని కోర్టు ఇటీవలే ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే రెండు సార్లు నిర్భయ హంతకులకు డెత్ వారెంట్ జారీ చేసింది న్యాయస్థానం. అయితే ఆ రెండు సార్లూ ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. చట్టబద్ధమైన నియమాలను ఉపయోగించుకుంటూ.. నిర్భయ హంతకులు రకరకాల పిటిషన్లతో శిక్ష అమలు నుంచి తప్పించుకున్నారు. అయితే మూడోసారిగా.. న్యాయస్థానం వారికి మార్చి 20న శిక్ష అమలు తేదీగా డెత్ వారెంట్ జారీ చేసింది.
ఆ వారెంట్ ప్రకారం శిక్ష అమలుకు మరెంతో సమయం లేదు. అయితే ఈ సారి అయినా అమలవుతుందా? అనేది మాత్రం సందేహమే. ప్రత్యేకంగా రీజన్లు ఏమీ కనిపించకపోయినా, నిర్భయ హంతకులు ఏదో ఒకటి చేసి శిక్ష అమలు నుంచి తప్పించుకుంటారేమో అనే అభిప్రాయాలకు ఆస్కారం ఏర్పడింది. ఇది వరకటి పరిణామాలే అందుకు కారణం.
ప్రస్తుతానికి అయితే నిర్భయ హంతకులకు అన్ని దారులూ మూసుకుపోయినట్టే. వారు అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం, వాళ్ల ఇంట్లో వాళ్లు మెర్సీ కిల్లింగ్ పిటిషన్ వేయడం, ఎన్ హెచ్ఆర్సీని ఆశ్రయించడం, కోర్టులో పిటిషన్లు.. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చిన పరిణామాలే చోటు చేసుకున్నాయి. నిర్భయ హంతకుల తల్లిదండ్రుల పిటిషన్లను ఎన్ హెచ్ ఆర్సీ పిటిషన్లు.. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చాయి. ఈ హంతకుల తల్లిదండ్రులు మానవహక్కుల కమిషన్ కు పిటిషన్ పెట్టగా, దాన్ని కమిషన్ తిరస్కరించింది. ఇక అంతర్జాతీయ న్యాయస్థానంలో వీరి పిటిషన్ ను పట్టించుకునేది ఉండదని, శిక్ష అమలు ఆగదని వార్తలు వస్తున్నాయి.
ఇక ఇప్పటికే తీహార్ జైల్లో నిర్భయ హంతకులకు డమ్మీ ఉరి శిక్ష అమలు జరిగిందని సమాచారం. ఈ నేపథ్యంలో రేపు వీరికి ఉరి అమలు చేయాల్సి ఉంది.