ఏలూరు ప్రశాంతం.. ఇప్పటికీ అంతుచిక్కని కారణం

అంతుచిక్కని అనారోగ్యంతో వందల మంది ఆస్పత్రి పాలవ్వడంతో ఒక్కసారిగా హెడ్ లైన్స్ లోకి ఎక్కింది ఏలూరు. ఆ వ్యాధి నుంచి ఇప్పుడు నగరం పూర్తిగా కోలుకుంది. ప్రభుత్వ హాస్పిటల్స్ తో పాటు వివిధ ప్రైవేటు…

అంతుచిక్కని అనారోగ్యంతో వందల మంది ఆస్పత్రి పాలవ్వడంతో ఒక్కసారిగా హెడ్ లైన్స్ లోకి ఎక్కింది ఏలూరు. ఆ వ్యాధి నుంచి ఇప్పుడు నగరం పూర్తిగా కోలుకుంది. ప్రభుత్వ హాస్పిటల్స్ తో పాటు వివిధ ప్రైవేటు హాస్పిటల్స్ లో జాయిన్ అయిన రోగులంతా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు ఒక్క కొత్త కేసు కూడా నమోదవ్వలేదు.

ఇలా ఏలూరు పూర్తిస్థాయిలో కోలుకుంది. కానీ వందలమంది ఒకేసారి అనారోగ్యానికి ఎందుకు గురయ్యారనే కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే దీనిపై రాష్ట్ర, కేంద్ర వైద్యారోగ్య సంస్థలు రంగంలోకి దిగాయి. వందల శాంపిల్స్ ను పరీక్షిస్తున్నాయి. ఆ రిపోర్టులు రావడానికి మరో 3 రోజులు టైమ్ పడుతుందంటున్నారు మంత్రి ఆళ్ల నాని.

కొంతమంది బాధిత కుటుంబాల్ని వ్యక్తిగతంగా కలిశారు మంత్రి. వాళ్ల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. 650 కుటుంబాలకు మందులతో పాటు బియ్యం, కూరగాయలు, నూనె, పప్పులు లాంటి నిత్యావసరాల్ని కూడా ఇంటి వద్దే అందిస్తున్నారు.

మరోవైపు తాజా ఘటనతో ఏలూరు మున్సిపల్ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. మొన్నటివరకు బాధిత ప్రాంతాల్ని మాత్రమే శుభ్రం చేసిన సిబ్బంది, ప్రస్తుతం సిటీ అంతా శానిటైజేషన్ ప్రక్రియను ప్రారంభించింది. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సహకారంతో ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తోంది.

బుధవారం ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ మరోసారి సమీక్ష నిర్వహించబోతున్నారు. అప్పటికి తుది నివేదక వచ్చే అవకాశం ఉందంటున్నారు. 

అటూ ఇటూ ఎటూ కాలేక!