ట్రంప్ 100 రోజులు: కళ్లెంలేని గుర్రం

డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండవ సారి ఎన్నికయ్యి 100 రోజుల పాలన పూర్తిచేసాడు. అయితే ఏంటి అనుకోవచ్చు!

డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండవ సారి ఎన్నికయ్యి 100 రోజుల పాలన పూర్తిచేసాడు. అయితే ఏంటి అనుకోవచ్చు! ఒకప్పుడు ఏమో కానీ అమెరికా రాజకీయం అనేది ఇప్పుడు భారతదేశానికి, భారతీయులకి కూడా కీలకమే.

ట్రంప్ వస్తే అమెరికా అద్భుతంగా తయారవుతుందని అక్కడివారు అనుకున్నారు. భారతదేశ నేపథ్యమున్న కమలా హారీస్ బరిలో ఉన్నా కూడా చాలామంది అక్కడి భారతజాతి పౌరులు ట్రంపుకే ఓటేసి అతని గెలుపులో భాగమయ్యారు. అంటే..అంతలా నమ్మారు అతనిని.

బైడెన్ పాలన చాలా నీరసంగా ఉండడంతో సాధారణ డెమాక్రటిక్ సానుభూతిపరులు సైతం ఈ సారి రిపబ్లికన్ పార్టీకే ఓటేసి ట్రంపుని గెలిపించారు.

అయితే 100 రోజుల ట్రంప్ పాలనలో ఓట్లేసి గెలిపించినవారి మనోగతం ఎలా ఉంది?

మొదటి టెర్మ్ లోనే తానేంటో చూపించిన ట్రంప్, రెండవ టర్మ్ లో 2.0 వర్షన్ చూపించడమే కాకుండా ఇంకా దూకుడుగా, కళ్లెం లేని గుర్రంలాగ పరుగెడుతున్నాడు.

ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఉక్కుపాదం మోపి వాళ్లని ఎక్కడా పనిచేయనీయకుండా చేసాడు. నెమ్మదిగా దశలవారిగా చేయకుండా అదాటున చేయడంతో, చాలా వ్యాపారాలు బ్లూ కాలర్ వర్కర్స్ లేక డీలా పడడమో, మూత పడడానికి సిద్ధంగా ఉండడమో జరుగుతోంది.

ఉదాహరణకి డలాస్ లో ఒక రెస్టారెంట్. పెద్దగా లాభాలు రావు కానీ, ప్రస్తుతానికి ఖర్చులు పోను బ్రేకీవెన్ అవుతోంది. ఎందుకంటే ఇన్నాళ్లూ అక్కడ పని చేసింది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. కూరలు తరగడం, అంట్లు తోమడం, టెబుల్స్ తుడవడం, ఫ్లోర్ ని మాపింగ్ చేయడం..అన్నీ వాళ్లే. తక్కువలో తక్కువ వేతనంతో పని జరిగేది. అంతే కాదు, కూతుళ్లదగ్గరికో, కొడుకు దగ్గరికో ఆర్నెల్ల కోసం టూరిజం వీసా మీద వచ్చిన మహిళలు కూడా రోజుకి 10 డాలర్లకి కూరలు తరిగే పని చేయడం వల్ల కూడా సదరు రెస్టారెంట్ నడుస్తుండేది. అలా కూడా పని చేయకూడదని ఇప్పుడు లా స్ట్రిక్ట్ అయినందువల్ల అలాంటి వాళ్లు కూడా దొరకట్లేదు. దాంతో చేసేది లేక హోటల్ పెట్టుకున్న ఓనర్, ఆయన భార్య ప్లేట్లు కడుక్కుంటున్నారు, కూరలు తరుక్కుంటున్నారు. విద్యార్థులకి పార్ట్ టైం జాబుల్లేక వాళ్లు కూడా ఇక్కడికి వచ్చి అడపదడపా తినడం కూడా మానేసారు. దాంతో ఇక వ్యాపారాన్ని మూసేసే ఆలోచనలో ఉన్నారు. లీగల్ గా ఉన్నవాళ్లని పెట్టుకోవాలంటే జీతాలెక్కువ ఇవ్వాలి. అప్పుడు నష్టాలే తప్ప, బ్రేకీవెన్ కూడా అవ్వదు. ఇంతకీ ఈ హోటల్ ఓనర్ ట్రంప్ గెలుపు కోసం పాటు పడిన వ్యక్తి. ఇప్పుడు బతుకు పాట్లు పడుతున్నారు.

ఇక గ్రీన్ కార్డ్ ఉన్నవాళ్లు కూడా భయపడే పరిస్థితి రావడం ట్రంప్ మార్క్ పాలనకి చిహ్నం. ఆఖరికి వాళ్లు ట్రాఫిక్ వయొలేషన్ చేసినా, డిపోర్ట్ అంటాడేమో అని భయపడుతున్నవాళ్లున్నారు. అలా జరగకపోయినా, ఫోబియా ఆ రేంజులో ఉంది. అమెరికన్ పాస్పోర్ట్ ఉన్నవాళ్లు తప్ప ఇతర ఏ తరహా వీసాలున్నవాళ్లైనా బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు.

ఇదిలా ఉంటే డాలర్ వేల్యూ పెరుగుతుందనుకుంటే పడుతోంది;
టెస్లా షేర్లు పైకి లేస్తాయనుకుంటే చతికిలబడ్డాయి;
స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగా లేవు;
ధరలు మిన్నంటుతున్నాయి;
ఫెడరల్ ఉద్యోగాలు పోవడంతో సిటిజెన్స్ కూడా కొందరు తిరగబడుతున్నారు…

…ఇవన్నీ స్టాక్స్ లో డబ్బులు పెట్టినవాళ్లని, ఫెడరల్ ఉద్యోగుల మీద బతుకుతున్న పరోక్ష వ్యాపారులని సంతోషంగా ఉంచడంలేదు.

ఇదంతా ఒకెత్తైతే ట్రంప్ ప్రకటనల్లో క్లారిటీ ఉండట్లేదు:

– కాలేజీలో విద్యార్థుల వీసాలు రీవోక్ చేసేసి, మళ్లీ వారిలో కొంత మందికి ఊరట కల్పించాడు. ఇలాంటి కేసులు వేలల్లో ఉన్నాయి మొత్తం అమెరికాలో.

– టారిఫ్ఫుల పేరుతో ప్రపంచాన్ని బెదరగొట్టి, స్టాక్ మార్కెట్లు కుప్పకూలేలా చేసి, మళ్లీ 3 నెలల గడువిచ్చాడు.

– గోల్డ్ వీసా అంటూ నానా హడావిడి చేసి మళ్లీ దాని ఊసు లేదు.

– ఉక్రైన్-రష్యా యుద్ధం ఆపేస్తానన్నాడు; చేసిందేంటో తెలీదు.

అమెరికాలోనే కాదు, ప్రపంచం దృష్టిలోనే ట్రంప్ మీద నమ్మకం సడలింది. ఆఖరికి తన పక్కదేశం కెనడా ఎన్నికల్లో తాను బలపరిచిన అభ్యర్థి ఓడిపోయి అపోనెంట్, లిబరల్ పార్టీకి చెందిన మార్క్ కార్నే నెగ్గి అధ్యక్షుడయ్యాడు.

ట్రంప్ నిలబెట్టిన ఎలాన్ మస్క్ చివాట్లు తింటున్నాడు. అతని టెస్లా షేర్ వేల్యూ మట్టికరిచింది. అతని మీద జనానిని గౌరవం, క్రేజ్ కూడా తగ్గింది.

పహల్గాం ఉదంతం గురించి అడిగితే, “పాక్ కి ఇండియాకి మధ్య కాశ్మీర్ గొడవ 1500 ఏళ్ల నాటిది” అంటూ కొత్త చరిత్రపాఠం చెప్పి బుర్రలేని పెద్దమారాజు అనిపించాడు.

ఏ మాత్రం బాధ్యత ఉన్న దేశాధ్యక్షుడైనా ఇలాంటి అసత్యచరిత్ర మాట్లాడడు. టెర్రరిజాన్ని బలంగా ఖండించకపోగా, అలాంటివి అక్కడ మామూలే అన్నట్టు మాట్లాడాడు. ఇవన్నీ అతని కేర్లెస్ నేచర్ కి, అవగాహనా రాహిత్యానికి నిదర్శనాలు. అంటే తన దృష్టిలో 9/11 లాంటిది అమెరికాలో జరిగితే టెర్రరజిం, ఇండియా-పాక్ మధ్యన జరిగితే సహజమా! ఏంటో మరి!

ఇలాంటి నరంలేని మాటల వల్ల కూడా ట్రంప్ భారతీయుల దృష్టిలో తన గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాడు.

ఎలా చూసుకున్నా ట్రంప్ 100 రోజుల పాలనలో బాగుంది అనుకోవడానికి సరైన ఫలితాలు ఏవీ కనిపించడంలేదు. తీసుకున్న నిర్ణయాలన్నీ ఏదో విధంగా ఇబ్బంది పెడుతున్నాయే తప్ప ఒక్కటీ సొల్యూషన్ దిశగా పయనించడంలేదు. కొన్ని నిర్ణయాల్లో నిబద్ధత, నిశ్చయం కూడా ఉండట్లేదు. మొత్తానికి 100 రోజుల ట్రంప్ పాలనలో రాజపూజ్యాలకంటే అవమానాలే ఎక్కువగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇదే ధోరణిలో ఉంటాడా, కాస్త మారతాడా, దేశాన్ని ఎటు తీసుకెళ్తాడు? ప్రపంచం ఎలా ప్రభావితమవుతుంది అనేని కాలమే చెప్పాలి.

పద్మజ అవిర్నేని

6 Replies to “ట్రంప్ 100 రోజులు: కళ్లెంలేని గుర్రం”

  1. తమరిది కడుక్కోరు కానీ పక్కనోడిది వాసన చూడటానికి ఉత్సాహ పడే నీ లాంటి వాళ్ళ వల్లే ఇండియా ఇలా ఉంది. కళ్లెం వెయ్యమై నిన్నెవరైనా అడిగారా? ఇప్పుడు ఆపిల్ కంపెనీ పూర్తిగా చైనా నుంచి ఇండియా కి షిఫ్ట్ అయ్యింది.

    కొంచెమైనా బుర్ర ఉండ? పూర్తిగా బ్రెయిన్ వాషెడ్ journalism.

  2. చాలా మంది ఇండియన్స్, Trump  వస్తే జాబ్స్ వస్తాయి, వాడు మంచి బిజినెస్ , వాడు తోపు అని, వోటు వేశారు, చాలా మంది చెప్పారు, వాడు చెప్పేవి తప్పు, tarrifs తో మొత్తం అతలాకుతలం అవుతుంది అని.  

    .

  3. Eeyana gatamlo kuda ilage abaddalu Artha satyalu cheppevadu. Misinformation spread chestunnadani Twitter lo ban ayyadu. Alanti vyaktini nammi votes vesina mee telivitetalaki taggatte behave chestunnadu.

Comments are closed.