Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఆరు కులాలు- వాటి లక్షణాలు

ఆరు కులాలు- వాటి లక్షణాలు

అన్ని కులాల్లోనూ అన్ని రకాలవాళ్లూ ఉంటారు. కానీ సహజంగా కొన్ని కులాలకి కొన్ని లక్షణాలు ఆపాదించడం పరిపాటి. 

మనిషి సంఘజీవి. మనిషి మీద కుటుంబసభ్యుల, బంధువుల, మిత్రుల ప్రభావం ఉంటుంది. నీ మిత్రుల్ని బట్టి నువ్వేంటో చెప్పొచ్చు అనే కోటేషన్ పాతదే. అలాగే నీ కులాన్ని బట్టి నీ గుణమేంటో చెప్పొచ్చనేది కూడా అంతే పాతది. 

పైకి చెప్పుకోకపోయినా, కులాన్ని గజ్జితో పోల్చినా ఎవరికి వారు ఎదుటివాడి కులాన్నిబట్టి గుణాన్ని అంచనా వేస్తుంటారు. 

ప్రతి కులంలోనూ మంచివాళ్లుంటారు, చెడ్డవాళ్లుంటారు. హంతకులుంటారు, సంఘసేవకులుంటారు..ఇలా చెప్పుకుంటూ పోతే ఏ కులమూ ఏ గుణానికి అతీతం కాదు. 

అయితే ఆయా కులాల్లో మెజారిటీ సభ్యుల్లో కనిపించే కామన్ లక్షణాలు కొన్నుంటాయి. వాటికి కారణం కూడా పైన చెప్పుకున్నట్టుగా కుటుంబ సభ్యుల నుంచి, బంధువుల నుంచి ప్రభావం చెందడం వల్ల, వాళ్ల డీఎన్యే వల్ల. వాటినే ఆ కులానికి ఆపాదించేస్తుంటాం.

ఇక్కడ కులాల పేర్లు నేరుగా ప్రస్తావించకుండా వాటికి ఆపాదించిన గుణాలేంటో చూద్దాం. ఒక ఆర్డర్లో కాకుండా మంచి, చెడు గుణాలన్నీ చెప్పేసుకుందాం. 

ఒకానొక కులంలో అధికశాతం మంది అతి జాగ్రత్తపరులు. వీళ్లకి పెద్ద పెద్ద జీవితాశయాలుండవు. వ్యాపారాలకంటే ఉద్యోగాలకే వీరు మొగ్గుచూపుతారు. అది కూడా అమెరికా లాంటి దేశాల్లో పెద్ద జీతంతో ఉద్యోగం వస్తే అదే జీవితానికి పరాకాష్ట అనుకునే టైపు. కడుపులో చల్ల కదలకుండా జీవితం వెళ్లిపోవాలి వీళ్లకి. బేసిగ్గా ఈ కులంలో పుట్టడమే గొప్ప అనుకునే ఫీలింగులో ఉంటారు కనుక వీళ్లకి ఆత్మన్యూనత చాలాతక్కువ, ఉన్నదాంట్లో సంతృప్తి ఎక్కువ. ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ ఉన్నా ధైర్యం చేసి వ్యాపారాలు పెట్టరు. కానీ వ్యాపారులకి సలహాలిచ్చి వాళ్ల వ్యాపారాభివృద్ధి చేయడంలో ఆనందం పొందుతారు. వీళ్లు అల్పసంతోషులు కూడా. చాలాసర్లు పొగిడితే పని చేసిపెట్టేసే రకాలు. 

డబ్బెలా డిమాండ్ చెయ్యాలో తెలియని మొహమాటస్థులు. వీళ్లకి కళలపట్ల ఆసక్తి ఎక్కువ. ఏ విద్య మీదైనా పట్టు సాధించడమంటే మక్కువ. ప్రతివిషయంలోనూ మనకెందుకొచ్చిన గొడవలే అనుకుని దులుపుకుపోయే రకం. వీధిలో గొడవజరుగుతుంటే తమదాకా రాకూడదని తలుపేసుకుని కూర్చుంటారు తప్ప ధైర్యంగా వెళ్లి ఆ గొడవని ఆపే పని చేసే వారు వీళ్లల్లో చాలా తక్కువ. అలాగని అందరూ ఇలా ఉండరు. ఈ కులంలో పుట్టిన చాలామంది నక్సల్ నాయకులుగా కూడా అడవుల్లో బతికారు. ఇదే పెద్ద కాంట్రాస్ట్. ఇక అతి పెద్ద నెగటివ్ ఏంటంటే వీళ్లల్లో ఐకమత్యం తక్కువ. ఎవడికి వాడే లీడర్లా ఫీలౌతాడు. అందుకే వీళ్లు వేరే కులాల వాళ్లకి పనికొస్తారు తప్ప తమ కులంలో వారి అభివృద్ధికి పెద్దగా తోడ్పడరు. 

ఇక మరొక కులం. వీళ్లల్లో ఉద్యోగం చెసేవాళ్లంటే చిన్నచూపు. చిన్నదో పెద్దదో బిజినెస్సులో ఉంటేనే వీళ్లు కంఫర్టెబుల్ గా ఫీలౌతారు. వీళ్లకి లెక్కలు వేళ్లమీదుంటాయి. చాలా వినమ్రత కలవారు. ఎన్ని కోట్లు సంపాదించినా దర్పం పొగరు ప్రదర్శించేవాళ్లు వీళ్లల్లో చాలా తక్కువ. ఎంత పొదుపరులుగా కనిపిస్తారో అంతటి దానధర్మాలు కూడా చేస్తారు. బంగారమన్నా, డబ్బన్నా వీళ్లకి భక్తి. గొడవల్లోకి వెళ్లడం వీళ్లకీ తక్కువే. పాలకులతో సత్సంబంధాలు పెట్టుకుని కావాల్సిన కార్యం చేయించుకోవడం కూడా వీళ్లకి తెలుసు. 

వీళ్లల్లో భక్తులు కూడా ఎక్కువే. గుళ్లు కట్టడానికి, యాగాలు చేయడానికి ఈ కులం వారి దగ్గరికి ఎక్కువగా విరాళాల కోసం వస్తుంటారు ఇతర జనం. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఎలా పొందాలి అనే లెక్కలే వీళ్లు ఎక్కువగా వేస్తుంటారు. లాభం కొంచెమే అయినా సరే వదులుకోవడానికి ఇష్టపడరు. ఉదాహరణకి బ్యాంకులో ఎఫ్డీల మీద ఇంటెరెస్ట్ పాయింట్ ఒకటి శాతం పెరిగిందన్నా మొత్తం విత్ డ్రా చేసి మళ్లీ డిపాజిట్ చేసే రకాలు. ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేయడం కంటే ఆస్తుల్ని కూడ బెట్టుకోవడాన్నే వీళ్లు సక్సెస్ గా భావిస్తారు. 

మరొక కులం విషయానికొద్దాం. అందరికీ కులాభిమానమున్నా వీళ్లకి అందరితో పోలిస్తే చాలా ఎక్కువ. వీళ్లు రిస్క్ తీసుకుని వ్యాపారాలు పెట్టడం, రిస్క్ తీసుకుని భారీగా అప్పులు చేయడం చేస్తుంటారు. షో ఆఫ్ చేయడానికి ప్రాధాన్యతనిస్తుంటారు. వీరు అవసరార్థం ఎవరితోనైనా త్వరగా స్నేహం చేయగలరు, అంతే త్వరగా మనుషుల్ని, వ్యవస్థల్ని మోసం చేసి మొహం చాటేయగలరు. అలాగే అవసరమనిపిస్తే ఛీగొట్టించుకున్న వాళ్ల దగ్గరకెళ్లి మళ్లీ సంబంధం కలిపేసుకోగలరు. సిగ్గు, మానం, మర్యాద, పౌరుషం అంటూ లెక్కలేసుకోరు. లక్ష్యం మీదే వీళ్లకి గురి. వీళ్లు చాలా తెలివైనవాళ్లు. తిమ్మిని బమ్మి చేయడం వీళ్లకి వెన్నతో పెట్టిన విద్య. సోషల్ స్కిల్స్ చాలా ఎక్కువ. 

ఏ రంగంలోనైనా దూసుకుపోయే రకాలు. ప్రపంచంలో చైనా నీతి ఎలాంటిదో వీళ్లదీ అంతే. ఏ రంగంలోనైనా ఆక్రమణ చేయాలనుకోవడం వీళ్ల గుణం. తమవాళ్లే అన్నింటిలోనూ టాప్ లో ఉండాలనే ఆలోచన వీళ్లది. తమదే అసలు సిసలైన ఉన్నతకులం అనే భావనలో ఉంటారు. ఇతర కులాల్లో తక్కువగా ఉండి వీళ్లల్లో ఎక్కువగా ఉండేది ఐకమత్యం. తమ కులంవాడు అంటే చాలు చేయి కలిపి ముందుకు సాగుతారు. ఈ కులంవారు మోస్ట్ సక్సెస్ఫుల్ అవడానికి కారణాల్లో ఈ ఐకమత్యమొక ముఖ్యమైన కారణం. 

ఇప్పుడు వేరే కులం గురించి చర్చించుకుందాం. వీళ్లకి నమ్మకద్రోహమంటే అస్సలు పడదు. ఒక్కసారి శత్రువుగా ఎవడైనా మైండులో రిజిస్టరైతే ఇక జీవితాంతం ఆ శత్రుత్వాన్ని కొనసాగిస్తారు. వీళ్లల్లో కూడా ఐకమత్యమెక్కువ. కలిసికట్టుగా ఉంటారు. ఒక్క మాటమీదుంతారు. పవర్ మీద కోరికెక్కువ. అన్నిరంగాల్నీ మింగేయాలన్న ఆక్రమణధోరణైతే తక్కువే. ఎంత స్వకులాభిమానమున్నా మిగిలిన కులాలతో మమేకమయ్యి వాళ్ల మనసుల్ని గెలుచుకునే గుణం వీళ్లకెక్కువ. వీళ్ల సక్సెస్ కి ఇదే ముఖ్యకారణం. 

నచ్చితే, నమ్మితే కులం లెక్క వేయకుండా నెత్తిన పెట్టుకుంటారు. వీళ్లకి ఆత్మాభిమానాలు, పౌరుషాలు జాస్తి. తమనెవరైనా అవమానిస్తే క్షమించే రకాలు అస్సలు కాదు. నాలుగింతలు ఎక్కువగా అవమానించగలరు. తెలివికన్నా మొండితనాన్ని ఎక్కువగా వాడతారు. ముక్కుసూటితనం ఎక్కువ. దాని వల్లే వీళ్లల్లో ఆవేశపరులూ ఎక్కువ. 

మరొక కులం. వీళ్లకి ఆలోచన తక్కువ ఆవేశమెక్కువ. పవర్ మీద మనసుంటుంది. దాని కోసం కలిసి పోరాడాలనుకుంటారు. కానీ సరిగ్గా పోరాడే టైముకి అంతర్గతంగా కుమ్ములాడుకుంటారు. పోరాడదామనుకునేటప్పుడుండే ఐకమత్యం పోరాడుతున్నప్పుడుండదు. అదే వీళ్ల ఎదుగుదలకి పెద్ద అడ్డంకి. వీళ్లల్లో మోసాలుండవు కానీ కుళ్లుగుణం బయటపెట్టేసుకుంటుంటారు. అసూయపడడం మానవసహజం. కానీ వీళ్లకి దానిని దాచిపెట్టుకునే ఫిల్టరుండదు. స్వకులాభిమానం చాలా ఎక్కువ. కానీ అది వీళ్లకి ఉపయోగపడేది తక్కువ. 

డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఎంటర్ప్రెన్యూరల్ నేచరుండదు. తమ ట్యాలెంటుని, పనిని చూసి ఎదుటివాడు తమమీద ఖర్చుపెట్టాలనుకుంటారు. ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్ ఎదగడం వీళ్లకి కంఫర్టెబుల్. పాలిష్డ్ బిహేవియర్ చూపించేవాళ్లు వీళ్లల్లో తక్కువ. త్వరగా ఎదిగిపోవాలి అనే ఆత్రుత వల్ల సంఘటిత విజయాలు అందుకోలేక ఎప్పటికప్పుడు నిరాశపడుతుంటారు. తమలో ఐకమత్యలోపం కారణంగానే ఎదగలేకపోతున్నామని తెలుకుంటుంటారు కానీ దానిని అధిగమించలేని నిస్సహాయులు. 

చివరిగా ఇంకొక కులం. వీళ్లల్లో అధికశాతం మంది బాగా చదువుకున్నవారు. వీళ్లల్లో భక్తులెక్కువ. అన్ని రంగాల్లోనూ దూసుకెళ్లగలరు. పవరంటే వీళ్లకి విపరీతమైన ఇష్టం. ఏ ఎండకాగొడుకు పట్టరు. వీళ్ల సంఖ్యాబలం తక్కువే అయినా లీగల్ గానూ, రౌడీయిజం పరంగానూ స్ట్రాంగ్. డాబు, దర్పాలతో కాకుండా చాపకింద నీరులాగ పెరిగే రకాలు. ఒక రకంగా చెప్పాలంటే అగ్రకులాలని చెప్పుకునే నాలుగైదు కులాలలోని లక్షణాలన్నీ వీళ్లల్లో అధికస్థాయిలో ఉంటాయి. తమకి అడ్డమొచ్చే శక్తుల్ని నిర్మూలించడానికి ఎంత దూరమైనా వెళ్తారు. శత్రువుని మిత్రుడిని చేసుకోవాలనే ధోరణి కన్నా అదిమిపెట్టాలనే ఆలోచనలే ఎక్కువ చేస్తుంటారు. అయితే వీళ్ల ప్రభ తెలుగురాష్ట్రాల్లో ఒక ప్రాంతానికే పరిమితం. 

ఇలా ప్రతి కులం గురించి చెప్పుకోవచ్చు. అలాగని పైన చెప్పుకున్నట్టుగా కేవలం ఫలానా కులంలో పుట్టాడు కాబట్టి ఫలాన గుణముంటుందని గీతగీసేయక్కర్లేదు. అందర్లోనూ అందరూ ఉంటారు. ఇది కేవలం డిస్కషన్ కి మాత్రమే. వెరైటీ ఉంటేనే వ్యవస్థ ఆసక్తికరంగా ఉంటుంది. అందరూ ఒకే రకంగా ఉంటే వైవిధ్యమెక్కడుంటుంది. తెలుగువాళ్లకి సినిమా, రాజకీయంతో పాటూ కులాల కబుర్లు కూడా రుచిస్తాయి కాబట్టే ఈ వ్యాసం. 

- నరేష్. ఎన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?