గీత తెలుసుకో..!

ప్రతి ఒక్కజీవితంలోనూ, ప్రతి ఒక్క బంధంలోనూ, ప్రతి ఒక్క వ్యవహారంలోనూ ఒక ‘గీత’ ఉంటుంది.

సీతమ్మ గీత దాటకపోయి ఉంటే అసలు రామాయణమే లేదని చాలా మంది పెద్దలు అంటూ ఉంటారు. గీత యొక్క విలువ ఏమిటో, దాన్ని గీసిన లక్ష్మణుడికి ముందే తెలుసు. దాటిన సీతకు సొంత అనుభవం తర్వాత తెలిసింది. ప్రపంచంలోని మేధావులు, తెలివైన వాళ్లు అందరూ ఇతరుల అనుభవాల నుంచి తాము పాఠాలు నేర్చుకుంటారని చెబుతుంటారు కదా..! మనం సీత అనుభవం చూసి.. ‘గీత’ యొక్క విలువ, ప్రాధాన్యం తెలుసుకోవాలి.

ప్రతి ఒక్కజీవితంలోనూ, ప్రతి ఒక్క బంధంలోనూ, ప్రతి ఒక్క వ్యవహారంలోనూ ఒక ‘గీత’ ఉంటుంది. ఆ గీతను గుర్తించడం, తెలుసుకోవడం అనేది వారి తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. గీత దాటకుండా ఉండడం అనేది వారి జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. గీత దాటేయడం అనేది వారి దురదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ‘గీత’ సర్వాంతర్యామి. ప్రతిచోటా ఉంటుంది. ఇదీ అదీ అని కాదు. కనీస మానవ సంబంధాల దగ్గరినుంచి వృత్తి, వ్యాపార, వ్యవహారాల వరకు.. రాజకీయ ఉత్థానపతనాల వరకు ‘గీత’ మన జీవితాలను శాసిస్తుంటుంది. జీవితం బాగుండాలంటే మనకు ఏది ముఖ్యమో తెలియజెప్పే ప్రయత్నం ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘గీత తెలుసుకో..’!

ఏదైనా ఎదురుదెబ్బ తగిలిందంటే.. ‘గీత బాలేదు గురూ..’ అంటుంటారు చాలా మంది– తమ తలరాతను ఉద్దేశించి. సదరు తలరాత గీత కూడా బాగా ఉండాలంటే.. ఇంకో గీత గురించి కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అది మనం దాటకూడని గీత. ఆ గీత దాటితే ఎలాంటి తల రాత అయినా మారిపోతుంది. మరొకరితో ముడిపడిన ఎలాంటి వ్యవహారంలో అయినా సరే.. మనం కొన్ని హద్దులు పరిమితులు పాటించాలి. గీత దాటకుండా ఉంటేనే క్షేమంగా ఉంటాం.

రాజకీయాల్లోనూ గీతలు..

మాట చాలా విలువైనది. మాటను చాలా ఆచితూచి ప్రయోగించాలి. కొడితే తగిలే గాయం కూడా మానిపోతుంది గానీ.. మాట చేసే గాయం ఒక పట్టాన మానేది కాదని అందరూ అంటూ ఉంటారు. అంటే మాట చేసే గాయం చాలా పెద్దది. ఇటీవలి పరిణామాలను గమనిస్తే.. కొండా సురేఖ నోటి దూకుడు ఒక పెద్ద ఉదాహరణ.

ఆమె ఏదో కార్యక్రమానికి వెళితే బిజెపి నాయకుడు రఘునందన్ రావు ఆమె కు ఖాదీ నూలు మాలను మెడలో వేస్తున్న ఫోటోను ట్రోల్ చేస్తూ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చెలామణీలోకి వచ్చాయి. అవి ఎవరినైనా బాధిస్తాయి. కొండా సురేఖ కూడా బాధపడ్డారు. కానీ.. మిగిలిన వారికంటె భిన్నంగా స్పందించారు. చాలా ఆగ్రహంగా స్పందించారు. నిజానికి కొండా సురేఖ ప్రభుత్వంలో భాగం. ఆమె స్వయంగా మంత్రి.

ఇలాంటి చవకబారు వ్యాఖ్యాలను బుచేసిన లేకి మనుషులను చిటికెలో పట్టుకోగలగాలి. పోలీసులను ఉపయోగించాలి. కేరక్టర్ అసాసినేషన్ చేస్తూ శునకానందం పొందుతూ ఉండే ఇలాంటి కిరాయి వెధవలకు బుద్ధి వచ్చేలాగా గట్టి శిక్షలు పడేలా చేయాలి. గట్టి చట్టాలు వచ్చేలా చేయగలిగితే ఇంకా సంతోషం. ఎందుకంటే ఆమె ప్రభుత్వంలో భాగం. ఇతర పార్టీల్లోని నాయకులకు ఇలాంటి అనుభవం ఎదురై ఉంటే వారు కేవలం ఆవేదన చెంది, మహా అయితే ఒక పోలీసు కంప్లయింటు కూడా ఇచ్చి అక్కడితో సరిపెట్టుకునే వారు. కానీ అలాగే చేస్తే ఆమె సురేఖ ఎందుకవుతారు?

కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో చేసే ట్రోలింగులకు ఆమె– కల్వకుంట్ల తారక రామారావును బాధ్యుడిగా నిర్ణయించేశారు. వారు తన పరువు తసే పని చేశారు గనుక.. తాను కేటీఆర్ పరువు తీయాలని అనుకున్నారు. ‘కేటీఆర్ స్త్రీలోలుడు, తనకు పరిచయం అయిన వారికి డ్రగ్స్ అలవాటు చేసే వ్యక్తి’ లాంటి విమర్శలు చేసి ఉన్నా కూడా ఒకరకంగా ఉండేది. ఏదో ఆయన మీద కడుపుమంటగా కనిపించేది. అక్కడితో ఆగకుండా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురి పేర్లను ఈ వివాదంలోకి లాగారు. వారి గురించి బాధ్యతగల మంత్రి పదవిలో ఉండే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చాలా నీచమైనవి.

ఏ ఒక్కరూ కూడా వాటిని సమర్థించలేదు. చివరికి ఆమె తమ పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి, తన ఈగోను తగ్గించుకుని తను రచ్చకీడ్చిన హీరోయిన్లకు సారీ చెప్పారు. కొందరికి ఆ సారీ కూడా చెప్పలేదు. పర్యవసానంగా క్రిమినల్ పరువునష్టం దావాలను ఎదుర్కొంటున్నారు. ఆమె సొంత పార్టీ వారు, సహచర మంత్రులు కూడా వెంట నిలవలేదు. ‘సారీ చెప్పేసింది కదా.. వదిలేయచ్చు కదా..’ వంటి నయగారపు మాటలు వల్లించారు తప్ప.. ఆమె వెంట నిలవలేదు. ఆమె ఒంటరిగా సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖుల విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

దీని పర్యవసానం ఆమె నోటిదూకుడు గల నేతగా, తన వాచాలత్వంతో పార్టీ పరువును కూడా బజారుకీడ్చగల నాయకురాలిగా సొంత పార్టీలోనే బహుశా ముద్రపడి ఉంటారు. మాటలలో ఇలా గీత దాటిన పుణ్యమాని.. ఏమైనా జరగవచ్చు. పార్టీకి ఆగ్రహం వస్తే– బహుశా ఆమె మంత్రి పదవి పోవచ్చు. లేదా ప్రజల్లో ఆమె పట్ల ఆగ్రహం, చులకన భావం వస్తే– వచ్చే ఎన్నికల్లో నెగ్గకపోవచ్చు. ఇలాంటి సకల వ్యవహారాలకు కారణం ‘గీత’ దాటి మాట్లాడడం. ఒక సెలబ్రిటీ రాజకీయ నాయకురాలిగా ఉన్నప్పుడు.. బాధ్యతగల మంత్రి పదవిలో ఉన్నప్పుడు.. మాటల్లో దాటకూడని గీత ఒకటి ఉంటుందని తెలుసుకోకపోవడం!

కుటుంబ బంధాల్లో అయినా..

గీత తెలుసుకోవడం అనేది కేవలం రాజకీయాల్లోనో, సెలబ్రిటీల విషయంలో మాత్రమే కాదు. మామూలు స్థాయి కుటుంబ బంధాల్లో కూడా చాలా చాలా అవసరం. చిన్న వాళ్ల కుటుంబ బంధాలు ఇంకా సులువుగా పుటుక్కుమంటాయి కూడా. అందుకే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.

ఇటీవల ఒక మిత్రుడు తన జీవితానుభవం చెప్పాడు. కొడుకు ఎదిగివచ్చాడు. బీటెక్ జాయిన్ అయ్యాడు. రకరకాల స్నేహితులు తయారవుతున్నారు. ఆ తండ్రి అన్నింటినీ గమనిస్తున్నాడు. కొడుకు కూడా లిక్కర్ తాగడం వంటి వ్యసనాలకు లోనవుతాడేమో అనే భయం తండ్రికి ఉంది. అలాగని కొడుకు సుద్దపూసగా ఉండాలనేది తండ్రి కోరిక కూడా కాదు. ఈరోజుల్లో చాలా మంది తండ్రుల్లాగా.. తన కొడుకు మరీ డ్రగ్ అడిక్ట్ అయిపోకుండా, పార్టీ డ్రింకింగ్ వరకు గాడితప్పితే చాలు అని కోరుకునే వ్యక్తి. చాలా రోజులు మధన పడిన తర్వాత.. ఒకరోజు కొడుకును అడిగేశాడు. ‘‘అరేయ్ నువ్వు కూడా ఫ్రెండ్స్ తో కలిసి మందు తాగుతున్నావా..’’ అని! దానికి ఆ కొడుకు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా.. ‘‘డాడీ.. నువ్వు నన్ను ఆ ప్రశ్న అడగొద్దు.. నేను సమాధానం చెప్పను..’’ అని!

తండ్రీ కొడుకులు పూర్తిస్థాయి ఫ్రెండ్స్ గా చెలామణీ అవుతున్న రోజుల సంగతి వేరు. కానీ, తండ్రీ కొడుకుల రూపంలోనే ఉన్నంత వరనకు ఇద్దరూ ఒకరి ప్రైవేట్ స్పేస్ లోకి మరొకరు ఎంటరయ్యే విషయంలో ఎంతగా అదుపు పాటిస్తే అంత మంచిది. ఒకసారి గీత దాటి ఆ ప్రశ్న అడిగేశాక.. ఇక ఎప్పటికీ కొడుకును తాను అనుకున్న రీతిలో కంట్రోల్ పెట్టడానికి ఆ తండ్రికి అవకాశం ఉండదు.

ఇంకో ఉదాహరణ కూడా చెప్పుకోవాలి. ఓ దంపతులు ఉన్నారు. భర్త సింపుల్ వ్యక్తి. కొంచెం చాదస్తం లేదా ఛాందసం అని కూడా అనుకోవచ్చు. భార్య కొంచెం ఆధునిక పోకడలతో ఉంటుంది. ఈ రోజుల్లో నూటికి 99 కుటుంబాల్లో ఉండే గృహిణుల మాదిరిగానే.. ఆమె తన పగటి జీవితంలో మెజారిటీ సమయాన్ని ఫోన్లు మాట్లాడుతూ.. మెసేజీలు చేసుకుంటూ బతికేస్తుంది. అంతవరకు పరవాలేదు. ఫోను మాట్లాడే ప్రతిసారీ.. ఇంట్లోని మిగిలిన మనుషులకు దూరంగా బెడ్రూంలోకో, టెర్రేస్ మీదకో వెళ్లిపోతుంది. ఈ వ్యవహారాలు ఆ భర్తకు చాలా అసహనం కలిగిస్తూ వచ్చాయి. ఒకనాడు బ్రేకింగ్ పాయింట్ కూడా వచ్చింది. సామ్యంగా, గీతలోపలే ఉండే అడిగే విచక్షణ కూడా మరచిపోయాడు. ‘ఎవరితో ఫోన్లు మాట్లాడుతూ ఉంటావు రోజంతా.. వాళ్లనే పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా..?’’ అని!

అయిపోయింది. అక్కడితో సున్నితమైన ఒక సూత్రం తెగిపోయింది. ఆమె ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేదు. ఇంతకూ ఆమె మాట్లాడేది బాయ్ ఫ్రెండ్ తోనేనా కాదా? అనే స్పష్టత కూడా లేదు. అలాగని భర్తతో తీవ్రస్థాయిలో గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోలేదు. రాద్ధాంతం చేయలేదు. ఏమీ జరగలేదు. కానీ.. ఇద్దరి మధ్య ఉండాల్సిన సున్నితత్వం చచ్చిపోయింది. ఏళ్లు గడిచాయి. ఇంకా కలిసే జీవిస్తున్నారు. రెండు విజాతి పక్షులు నివసిస్తున్న గూడులా ఉంటుంది ఆ సంసారం. ఏంటి లాభం. గీతలోపలే ఉండి.. గీత దాటకుండా అడిగి.. అనుమానాన్ని నివృత్తి చేసుకోగల సంయమనం లేకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది.

జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు సాగాలే గానీ.. మన నిత్య జీవితంలో ఆప్త మిత్ర బంధు గణాల్లో ఇలాంటి ఉదాహరణలు మనకు వేలకు వేలు కనిపిస్తుంటాయి. ప్రతి ఉదాహరణ నుంచి పాఠం నేర్చుకోవడమే మనం చేయదగిన పని.

పది సెకన్ల సిద్ధాంతం..

ఈ గీత తెలుసుకోవడానికి మనకు సులువైన మార్గం ఏమిటి? ఇందుకు ఒక మంచి ఉపాయం ఉంది. అదే పది సెకన్ల సిద్ధాంతం.

జల్సా సినిమాలో మనకు సునీల్ పాత్ర ఒక మంచి పాఠం. వాడి తొందరపాటు రోగానికి మందుగా పది లెక్క పెట్టిన తర్వాత పని చేయడం అనే విరుగుడు సజేస్ట్ చేస్తాడు డాక్టరు. అచ్చంగా అదే కాకపోయినా.. ప్రతి మనిషికి మాట్లాడేప్పుడు ఒక ఫిల్టర్ ఉండాలి. మాటల మీద ఆ ఫిల్టర్ ప్రయోగించాలి.

ఉదాహరణకు మనం మిత్రుడితో ఒక మాట చెప్పాలని అనుకున్నప్పుడు.. వెంటనే చెప్పేయకూడదు. ఆ మాట చెప్పడం వలన మిత్రుడి స్పందన ఎలా ఉంటుందో ఒక్క క్షణం మనం ఆలోచించుకోవాలి. ఒక మాట యొక్క పర్యవసానాలు ఎలా ఉండగలవో మనం రెప్ప పాటులో బేరీజు వేసుకోవాలి. ఆ మాట నొప్పించే అవకాశం ఉన్నదని అనిపిస్తే.. అదే మాటను మరొక రూపంలో అడగడం సాధన చేయాలి. అప్పుడు గీత మనకు అర్థమైపోతుంటుంది.

చెప్పుకోడానికి చాలా పాత పాఠం లాగా అనిపిస్తుంది గానీ.. “నొప్పింపక తానొవ్వక..” అని సాగిపోయే సుమతి శతక పద్యం ఈ విషయంలో వేదం వంటిది. మనం తెలుసుకోవలసిన గీతను అది స్పష్టంగా చూపిస్తుంది. సుదృఢమైన మానవ అనుబంధాలకు పునాదిగా మారుతుంది.

.. ఎల్. విజయలక్ష్మి

36 Replies to “గీత తెలుసుకో..!”

  1. అంటే సురేఖ సీతమ్మ కాబట్టి గీత దాటింది అన్నావు మరి డ్రామా రావు గాడు రావణాసురుడి లాగ సమంత ని , రకుల్ ని ఫార్మ్ హౌస్ లో డ్రగ్స్ అలవాటు చేసి లోబరుచుకోవటం వలెనే రేవంత్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు కదా అది రాయలేదు ?

  2. గీత. దాటి మాట్లాడినందుకు TV 5 నుండి 100 కోట్ల కి పరువు నష్టం నోటీసు లు వచ్చాయా??

  3. అక్కోయ్…బుద్దున్నవాళ్ళందరు సాధ్యమైనంతవరకు సహనాన్ని పాటిస్తారు….కానీ నాకు తెలుగే వాచ్చు కాబట్టి మనతెలుగు మీడియాలలో ఎదుటి వ్యక్తిని పూర్తిగా మానసిక క్షోభకు గురిచేసి వాళ్ళు పిచ్చిక్కి అరిచ్ఎఎల్ఆ చేసే lk లు ఎక్కువ..కాబట్టి అనుకోకుండా ఎన్నోసార్లు గీత దాటెస్టు ఉంటాం.

  4. ఆనాడు ‘గీత’ చెరిపించాడు రావణుడు.

    ఆనాడు నిండు సభలో ‘గీత’ దాటాడు ధుర్యోధనుడు.

    అప్పుడు తండ్రిని హెలీ-కా-ప్టర్-ఎక్కించి’గీత’ దాటాడు ఒకడు.

    బాబా-యిని బాత-రూంలో-కడిగి-‘గీత’దాటాడు.

    చెల్ల-యిని పొలిమేర దాటింది గీత దాటాడు.

    భయపడి అ-మ్మ ఎలక్ష-న్ టైంలో దేశపు ‘గీత ‘ దాటేసి పరాయి దేశంలో ప్రాణం కాపాడుకుంది.

  5. తండ్రి, కొడుకుని మందు తాగుతున్నావా అని అడగడం తప్పా?! దానికి కొడుకుకి పొడుచుకు వచ్చిందా?! అంత ఆత్మాభిమానం ఉన్న కొడుకైతే తన చదువుకి, బట్టలకి, బైకులకి, పెట్రోల్ కి, సినిమాలకి, జల్సాలకి తండ్రి డబ్బులు అడగకూడదు. సొంతగా కష్టపడి సంపాదించుకోవాలి! తండ్రిమీద ఆధారపడ్డంత కాలం అడిగే హక్కు తండ్రికి ఉంటుంది, చెప్పాల్సిన బాధ్యత కొడుకు మీద ఉంటుంది! ఏం?! వీడు షాపులో ఓ రెండువేలు పెట్టి ప్యాంట్ కొన్నప్పుడు అది మర్నాడే చిరిగితే షాపుకి తీసుకెళ్ళి ఇదేమిటి అని అడగడా? మరి షాపువాడు మీరు ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు సార్ అంటే ఊరుకుంటాడా?!

  6. తండ్రి, కొడుకుని మం దు తా గు తు న్నా వా అని అడగడం తప్పా?! దానికి కొడుకుకి పొ డు చు కు వచ్చిందా?! అంత ఆత్మాభిమానం ఉన్న కొడుకైతే తన చదువుకి, బట్టలకి, బైకులకి, పెట్రోల్ కి, సినిమాలకి, జల్సాలకి తండ్రి డబ్బులు అడగకూడదు. సొంతగా కష్టపడి సంపాదించుకోవాలి! తండ్రిమీద ఆధారపడ్డంత కాలం అడిగే హక్కు తండ్రికి ఉంటుంది, చెప్పాల్సిన బాధ్యత కొడుకు మీద ఉంటుంది! ఏం?! వీడు షాపులో ఓ రెండువేలు పెట్టి ప్యాంట్ కొన్నప్పుడు అది మర్నాడే చిరిగితే షాపుకి తీసుకెళ్ళి ఇదేమిటి అని అడగడా? మరి షాపువాడు మీరు ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు సార్ అంటే ఊరుకుంటాడా?!

  7. ఇలాంటి గీతల్ని చేరిపేసిన మన గుడివాడ, గన్నవరం తమ్ముళ్ల సంగతేంటి అక్కయ్య గారు

  8. గీతా దాటడం గురించి ఇంత పెద్ద స్టోరీ రాసే బదులు సింపుల్ గా 2019-2024 వైసీపీ పాలన చూపిస్తే సరిపోయేది కదా

  9. తండ్రి, కొడుకు అలవాట్ల గురించి అడగడం గీత దాటడమా?! దానికి కొడుకు ఆత్మాభిమానం దెబ్బతిన్నదా?! అలా అయితే తన చదువుకి, బట్టలకి, బైకులకి, పెట్రోల్ కి, సినిమాలకి, జల్సాలకి తండ్రి డబ్బులు తీసుకోవడం మాట ఏమిటి? ఏం?! వీడు షాపులో ఓ రెండువేలు పెట్టి ప్యాంట్ కొన్నప్పుడు అది మర్నాడే చిరగరాని చోట చిరిగితే షాపుకి తీసుకెళ్ళి ఇదేమిటి అని అడగడా? మరి షాపువాడు మీరు ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు సార్ అంటే ఊరుకుంటాడా?! తండ్రిమీద ఆధారపడ్డంత కాలం అడిగే హక్కు తండ్రికి ఉంటుంది, చెప్పాల్సిన బాధ్యత కొడుకు మీద ఉంటుంది! 

  10. తండ్రి, కొడుకు అలవాట్ల గురించి అడగడం గీత దాటడమా?! అలా అయితే తన చదువుకి, తన తిండికి, తన బట్టలకి, తన సంతోషాలకి తండ్రి డబ్బులు తీసుకున్నప్పుడు ఏమైంది ఈ గీత? ఏం?! వీడు షాపులో ఓ రెండువేలు పెట్టి ప్యాంట్ కొన్నప్పుడు అది మర్నాడే చిరగరాని చోట చిరిగితే షాపుకి తీసుకెళ్ళి ఇదేమిటి అని అడగడా? మరి షాపువాడు మీరు ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు సార్ అంటే ఊరుకుంటాడా?! తల్లితండ్రుల మీద పిల్లలు ఆధారపడ్డంత కాలం అడిగవలసిన బాధ్యత వాళ్ళమీద ఉంటుంది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది! ఇందులో గీత దాటడం ఏమీ లేదు.

  11. తండ్రి, కొడుకు అలవాట్ల గురించి అడగడం గీత దాటడమా?! అలా అయితే తన చదువుకి, తన తిండికి, తన బట్టలకి, తన సంతోషాలకి తండ్రి డబ్బులు తీసుకున్నప్పుడు ఏమైంది ఈ గీత? ఏం?! వీడు షాపులో ఓ రెండువేలు పెట్టి ప్యాంట్ కొన్నప్పుడు అది మర్నాడే చిరగరాని చోట చిరిగితే షాపుకి తీసుకెళ్ళి ఇదేమిటి అని అడగడా? మరి షాపువాడు మీరు ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు సార్ అంటే ఊరుకుంటాడా?! తల్లితండ్రుల మీద పిల్లలు ఆధారపడ్డంత కాలం అడిగవలసిన బాధ్యత వాళ్ళమీద ఉంటుంది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది! ఇందులో గీత దాటడం ఏమీ లేదు.

Comments are closed.