Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఇద్దరికీ మరీ ఇన్ని పోలికలా?

ఇద్దరికీ మరీ ఇన్ని పోలికలా?

తండ్రిపోలికలు కొడుకుకి రావడం సహజం. కానీ ఒక్కొక్కప్పుడు ఒకే పోలికలున్న ఇద్దరు తండ్రీకొడులంత దగ్గరైపోతారు. దత్తపుత్రుడు అనే మాటంటే పవన్ కళ్యాణ్ కి కోపం రాకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడో ఆ పిలుపు అలవాటైపోయుండాలి. 

చంద్రబాబు-పవన్ ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తారు.. ఒకేలా ప్రవర్తిస్తారు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. 

కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో ఇద్దరూ సిద్ధహస్తులు. ఆ అబద్ధం చెప్పేటప్పుడు వాళ్లల్లో ఎక్కడా అబద్ధమాడుతున్న బాడీ లాంగ్వేజ్ కనపడదు. హైటెక్ సిటీ తానే కట్టానని చంద్రబాబు ఎంత నమ్మకంగా చెబుతాడో, ఆంధ్రాలో 36000 మంది అమ్మాయిలు వాలంటీర్ల వల్ల కిడ్నాప్ అయిపోయారని కూడా అంతే నమ్మకంగా చెబుతాడు పవన్ కళ్యాణ్. తాము ఆడే అబద్ధానికి సాక్ష్యం ఉండాల్సిన అవసరముందని కానీ, నిజం తెలిసిన జనం వెక్కిరిస్తే ఏంటనే స్పృహ కానీ ఉండదు ఈ ఇద్దరికీ. 

చంద్రబాబు, పవన్ ఇద్దరూ లాబీయింగులో ప్రతిభావంతులు. పొత్తు పేరుతో నిస్సిగ్గుగా గతశత్రువులని మిత్రులుగా మార్చుకునే డ్రామాలాడగలరు, ప్రస్తుత మిత్రుల్ని అవసరార్ధం నిస్సంకోచంగా పక్కన పెట్టేయగలరు. తానే బూతులు తిట్టిన చంద్రబాబు పంచన చేరి ఆ నీడలో హాయిగా బతికేయగలడు పవన్ కళ్యాణ్. అలాగే తాను తిట్లు తిట్టిన మోదీని, అతని పరివారాన్ని వేడుకుని పొత్తు కుదుర్చుకుని ఆ నీడలో బతికేయగలడు చంద్రబాబు. 

అంతే కాదు..సొంత మామ నుంచి, సొంత సోదరుడి వరకు..ఎవర్నైనా తన రాజకీయవాంఛకి బలిచేయగల దిట్ట చంద్రబాబు. అదే పద్ధతిలో తన అవసరంకోసం అన్నయ్య నాగబాబు సీటుని కూడా త్యాగం పేరుతో పక్కనపెట్టేయగల పాషాణహృదయుడు పవన్. ఈ విషయంలో ఇద్దరికీ ఆత్మాభిమానాలుండవు.  

ఇద్దరూ తమ ఓటమికి కారణాల గురించి ఒకేలా మాట్లాడతారు.

నిన్నటికి నిన్న చంద్రబాబు అన్న మాటని గుర్తు తెచ్చుకోవాలి. తన పరిపాలనలో ఐటీని ప్రవేశపెట్టడం వల్ల జనాభాలో అధికశాతం మంది అమెరికాకి వలసపోయారట. తన ఓటర్లంతా వారిలోనే ఉన్నారట. అందుకే తెదేపా గత ఎన్నికల్లో ఓడిపోయిందట.

అసలేమనుకుంటున్నాడు చంద్రబాబు?

తన ఓటర్లంతా ఐటీ ఉద్యోగులేనా?

ఇంకెవ్వరూ లేరా?

రాష్ట్రప్రజలంటే ఐటీ వాళ్లే ఉంటారా?

ఇతరులుండరా? ఉన్నా వాళ్లు ఓట్లేయరనా?

మరి తన ఓటు బ్యాంకు అమెరికాలో ఉంటే ఇక్కడెందుకు? అక్కడికే పోయి ఈబీ5 వీసా తీసుకుని త్వరగా అమెరికా పౌరుడైపోయి అక్కడే డోనాల్డ్ ట్రంప్ మీద పోటీచేయొచ్చుగా?

ఏదేదో మాట్లాడితే ఇలాంటి అర్ధంలేని సలహాలే ఇవ్వాలనిపిస్తుంది. 

ఇక పవన్ కళ్యాణ్ సంగతి చూడండి. తాను గత ఎన్నికల్లో పులివెందులలో ఓడిపోయినా బాధపడే వాడు కాదట.. భీమవరంలో ఓడినందుకే బాధట. ఎందుకంటే పులివెందుల్లో రెడ్లు కాబట్టి ఓడించారులే అనుకునేవాడట. భీమవరంలో కాపులుండి కూడా ఎలా ఓడాడో అర్థం కాక బాధట. ఇలాంటివి విన్నప్పుడల్లా అతడు సినిమాలో తనికెళ్ల భరణి ట్రాక్టర్ సౌండ్ కి "అరేయ్! ఆపరెరేయ్!" అని అరవాలనిపించదూ..!!

కాపు ఓటర్లు ఎక్కువగా ఎక్కడుంటారో వెతుక్కుని మరీ నిలబడడం, అలా నిలబడ్డా కూడా ఓడిపోయినందుకు ఏడవడం చూస్తుంటే.. కులరాజకీయాలనే నమ్ముకున్న ఈ కులనాయకుడు ఎప్పటికీ జననాయకుడవ్వలేడని ఎలిమెంటరీ విద్యార్థి కూడా చెబుతాడు. తాను కాపునని ఒకసారి, కాదు రెల్లి కులస్తుడినని ఒకసారి, జంధ్యం వేసుకుని బ్రాహ్మణుడనని మరోసారి చెప్పుకోవడం... చూస్తే కంపరమేస్తుంది. ఆ విషయం అతనికి తెలుస్తోందో లేదో.  

మరో పోలికేంటంటే.. చంద్రబాబు, పవన్ లు ఇద్దరికీ వాళ్ల సోలో ప్రతిభ మీద అస్సలు నమ్మకంలేదు. ఇద్దరికీ వెన్నెముకలో బలం లేదు. ఆనుకోవడానికి ఆసరా కావాలి. పొత్తు లేనిదే లేచి నిలబడలేరు. పొత్తే వీళ్ల ఊపిరి, గుండెచప్పుడు కూడా! 

ఇన్నేసి పోలికలున్న ఈ ఇద్దర్నీ తెలుగు ప్రజలు మరిచిపోరు. వీళ్లు, వీళ్ల మీడియాలు ఏర్పరిచిన మాయాప్రపంచంలో ఉన్న కొందరికి తప్ప మిగిలిన ప్రజలందరికీ వీళ్లు హీనచరితుల్లా కనిపిస్తున్నారు. "రాష్ట్రప్రయోజనాలు" అనే పదం వాడుకుని స్వప్రయోజనాలు, స్వలాభాల కోసం బ్రతికే రాజకీయనాయకుల్లా తమని తాము చూపించుకుంటున్నారు. 

ఎన్నికలు దగ్గరపడే వేళ కాస్తైనా బుర్రవాడి, కొంతైనా వీళ్ళు ఇమేజ్ మేకోవర్ చేసుకుని తటస్థ ఓటర్లని కూడా తమ వైపు తిప్పుకుంటారేమో అనుకుంటే.. అసలా ప్రయత్నమే లేదు. మరింత దిగజారి, మరింత మసకబారి మునగడానికి సిద్ధంగా ఉన్న చిల్లు పడ్డ పడవల్లాగ కనిపిస్తున్నారు ఈ ఇద్దరూ! 

- హరగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?