Advertisement

Advertisement


Home > Politics - Opinion

టీడీపీలో జ‌న‌సేన విలీనం ఎప్పుడు?

టీడీపీలో జ‌న‌సేన విలీనం ఎప్పుడు?

‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ సీజన్‌-2లో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో ఇంట‌ర్వ్యూ ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే మొద‌టి భాగం స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా సెకెండ్ ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమో విడుద‌లైంది. ఈ ఎపిసోడ్‌లో ప‌వ‌న్‌కు రాజ‌కీయ అంశాల‌పై బాల‌కృష్ణ సంధించిన ఓ ప్ర‌శ్న భ‌లే గ‌మ్మ‌త్తుగా వుంది. ఇలా ప్రోమో విడుద‌ల కావ‌డ‌మే ఆల‌స్యం, దానిపై నెటిజ‌న్లు త‌మదైన రీతిలో సృజ‌నాత్మ‌క కౌంట‌ర్లు విసురుతున్నారు.

‘పార్టీ ఎందుకు.. తెలుగుదేశంలో చేరి ఉండవచ్చు కదా? ’  అని ప‌వ‌న్‌ను బాల‌య్య ఇంగ్లీష్‌లో ప్ర‌శ్నించారు. తెలుగులో ప్ర‌శ్నిస్తే... అంద‌రికీ తెలిసి న‌వ్వుకుంటార‌నే ఉద్దేశం కాబోలు అని నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు. ఇదిలా ఉండ‌గా బాల‌య్య ప్ర‌శ్న‌కు ప‌వ‌న్ స‌మాధానంపై ఉత్కంఠ రేపుతోంది. రాజ‌కీయాల్లో ఆధిప‌త్య ధోర‌ణి వుంటుంద‌ని, ఎవ‌రైనా ఎదుగుతుంటే రానివ్వ‌కుండా ఉండ‌టం అనేది వారి వ్యూహంలో భాగ‌మ‌ని ప‌వ‌న్ త‌నకు తోచిన రీతిలో చెప్పుకొచ్చారు. అయితే పూర్తిస్థాయిలో వీడియో విడుద‌లైతే త‌ప్ప‌, ప‌వ‌న్ ఏం చెప్పార‌నేది తెలిసే అవ‌కాశం వుండ‌దు.

కానీ బాల‌య్య అడిగిన ప్ర‌శ్న‌ను కేంద్రంగా చేసుకుని నెటిజ‌న్లు వాళ్లిద్ద‌రినీ ఆడుకుంటున్నారు. ‘జ‌న‌సేన పార్టీ పెట్టారే త‌ప్ప‌, ఆయ‌న ప‌ని చేసేది మీ పార్టీ కోస‌మే క‌దా బాల‌య్యా...ఇంకెందుకు బాధ’ అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఔను, టీడీపీలోనే చేరాల‌ని ఎందుకు అడుగుతున్నారు? వైసీపీ అంటే ప‌వ‌న్‌కు గిట్ట‌దు. బీజేపీ ఏం పాపం చేసింది’ అనే ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి.

‘ జ‌రిగిపోయిన వాటి గురించి ప్ర‌శ్నిస్తే ఏం లాభం. జ‌ర‌గాల్సిన కార్యం గురించి ఆలోచించాలి. ఇప్పుడు అడ‌గాల్సిన ప్ర‌శ్న అది కాదు బాల‌య్య‌. ఇప్ప‌టికైనా మించి పోయింది లేదు. తెలుగుదేశంలో ఎప్పుడు విలీనం చేస్తావ‌ని అడిగి వుంటే బాగుండేది బాల‌య్య’  అంటూ నెటిజ‌న్లు త‌మ‌దైన సృజ‌నాత్మ‌క ప్ర‌శ్న‌లు సంధించ‌డం విశేషం.

సొదుం ర‌మ‌ణ‌

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?