Advertisement

Advertisement


Home > Politics - Opinion

త‌న‌నే జైల్లో పెడితే లెక్క చేయ‌లేదు జ‌గ‌న్!

త‌న‌నే జైల్లో పెడితే లెక్క చేయ‌లేదు జ‌గ‌న్!

త‌నే స్వ‌యంగా 16 నెల‌ల పాటు జైల్లో గ‌డ‌పాల్సి వ‌స్తేనే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లెక్క చేసింది లేదు. త‌న పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం అంటేనో, సోనియాకు దాసోహం అని ఉంటేనో.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అరెస్టు అయిన ప‌ది ఇర‌వై రోజుల్లోనే బెయిల్ దొర‌క‌డం పెద్ద క‌ష్టం కాద‌ప్పట్లో! ప్రాథ‌మిక న్యాయాన్ని ఉల్లంఘిస్తూ కూడా అప్ప‌ట్లో సీబీఐ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ద‌ర్జాగా జైల్లో పెట్ట‌గ‌లిగింది. 

ఒకటి కాదు రెండు కాదు 16 నెల‌ల పాటు! అంత వ‌ర‌కూ జ‌గ‌న్ అనుభ‌వించిన వైభ‌వానికి జైలు జీవితాన్ని త‌ట్టుకోవ‌డం అంటే అప్ప‌టికే అతడెంత రాటుదేలి ఉంటాడో అర్థం చేసుకోవ‌డానికి అంత‌కు మించి వేరే అవ‌స‌రం లేదు!

మ‌రి కేంద్రంలో అధికారంలో ఉన్న వారు 16 నెల‌ల పాటు త‌నను నిర్బంధిస్తే కూడా వారికి లొంగ‌క రాజ‌కీయ పోరాటానికి సాగించిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాత చ‌రిత్ర ఏమీ కాదు. వ‌ర్త‌మాన‌మే! ఇప్పుడు ఈ ప్ర‌స్తావ‌న ఎందుకంటే.. వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ప‌రిణామాల‌పై జ‌గ‌న్ బెంబేలెత్తిపోతూ ఉన్నాడ‌ని, లాబీయిస్టుల‌ను పిలిపించుకుంటున్నాడ‌ని, బీజేపీ జ‌గ‌న్ కు సాయం చేయ‌లేద‌ని, ఢిల్లీ ఛీ కొట్టింద‌ని, లండ‌న్ ప‌ర్య‌ట‌న‌ను జ‌గ‌న్ ర‌ద్దు చేసుకున్నాడ‌ని.. ప‌చ్చ‌మీడియా వ‌ర్గాలు ఉర‌క‌లెత్తిపోతూ త‌మ‌వైన క‌హానీల‌ను వండి వారుస్తూ ఉంటే! ఎవ‌రి గురించి ఏం చెబుతున్నారా! అనుకోవాల్సి వ‌స్తోంది.

తన‌నే తీసుకెళ్లి 16 నెల‌ల పాటు జైల్లో పెడితే, కుటుంబాన్ని రోడ్డు మీద నిల‌బెడితే, ఓర్పుతో నేర్పుతో జ‌గ‌న్ పోరాడాడు. ప్ర‌జ‌లు, దేవుడు.. వీరినే త‌ను న‌మ్ముతానంటూ ఒక‌టికి వంద సార్లు చెప్పాడు. ఇప్పుడూ అదే చెబుతూ ఉన్నాడు. 

ఒక‌వేళ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే.. అప్పుడు జ‌గ‌న్ స్పంద‌న ఎలా ఉంటుంది? ప‌చ్చ‌మీడియా చెబుతున్న‌ట్టుగా అయితే క‌చ్చితంగా కాదు! ఈ కేసును చ‌ట్ట‌ప‌రంగా ఎదుర్కొనాల్సిందే అంటూ జ‌గ‌న్ అవినాష్ కు అయినా చెప్ప‌వ‌చ్చు కానీ అంత‌కు మించి స్పంద‌న ఉంటుంద‌నుకోవ‌డం ప‌చ్చ భ్ర‌మే! ప్ర‌త్య‌ర్థుల కుట్ర కావొచ్చు, గ్ర‌హ‌చారం కావొచ్చు.. ఏ కార‌ణం చేత అయినా.. అవినాష్ జైలుకు వెళ్లినా.. అరెస్టు అయ్యి, న్యాయ‌పోరాటం చేసి బ‌య‌ట‌కు రావాల‌ని జ‌గ‌న్ అవినాష్ కు చెప్ప‌డ‌మే త‌ప్ప ఎమోష‌న‌ల్ అయిపోయో, లేదా బెంబేలెత్తిపోయే స్వ‌భావం జ‌గ‌న్ ది కాదు!

జ‌గ‌న్ బెంబేలెత్తిపోయే టైపే అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌గ‌న్ అనే వాడు ఏపీ పొలిటిక‌ల్ మ్యాప్ లో ఉండేవాడు కాదు! బెంబేలెత్తిపోయే టైపు అయితే.. కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి జ‌గ‌న్ క‌ల‌లో కూడా సాహ‌సించే వాడు కాదు. బెంబేలెత్తిపోయే టైపైతే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌యాణం మాఘ‌లో పుట్టి పుబ్బ‌లో ముగిసిపోయేది! 

జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నాడ‌నో, బెంబేలెత్తిపోతున్నాడ‌నో, అన్నీ ర‌ద్దు చేసుకుని ఇంట్లో కూర్చున్నాడ‌నో చెప్పుకోవ‌డం ద్వారా ప‌చ్చ‌మీడియా శున‌కానందం పొంద‌డ‌మే త‌ప్ప‌, అంత‌కు మించి సీన్ ఏమీ ఉండ‌దు. అస‌లేమీ లేన‌ప్పుడే బ్ర‌హ్మాండం బ‌ద్ధ‌లైపోతోంద‌న్న‌ట్టుగా ప‌చ్చ‌వ‌ర్గాలే బెంబేలెత్తాయి. అలాంటిది ఇప్పుడు రెచ్చిపోవ‌డంలో పెద్ద ఆశ్చ‌ర్య‌మూ లేదు. 

మ‌రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఊహాజ‌నిత‌మైన అభియోగాలు కోర్టు ముందు నిలుస్తాయా! వాస్త‌వాలు ఏమిటో దైవానికి ఎరుక‌.. త‌మ‌కు రాజ‌కీయంగా అడ్డు అవుతాడేమో అనే భ‌యంతో ఒక ఎంపీ, మాజీ ఎంపీని-మాజీ ఎమ్మెల్సీని- రాజ‌కీయ ప్రాభావాన్ని కోల్పోయిన వ్య‌క్తిని చంపించేసి ఉంటాడ‌నే వాళ్ల‌కు త‌మ వాద‌న‌లో ధీమా ఎంతో కానీ, వినేవారి విచ‌క్ష‌ణ‌కే ఇది అస్స‌లు నిల‌బ‌డే వాద‌న కాదు!

-జీవ‌న్ రెడ్డి.బి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?