ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పద్మశ్రీ తరహాలో ప్రతిభావంతులకు లైఫ్ అచీవ్ మెంట్ అవార్డులు ఇవ్వాలని సంకల్పించింది. ఆగస్టు పదిహేను, జనవరి ఇరవైఆరు తేదీలలో ఈ అవార్డులను ప్రకటించాలని ప్రతిపాదించినట్లు సమాచార శాఖ మంత్రి పేర్నినాని చెప్పారు. ఏపీ మంత్రివర్గం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశం అయి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
వైఎస్ఆర్ లైఫ్ అచీవ్ మెంట్ అవార్డులను ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందని ఆయన చెప్పారు. వివిధ రంగాలలో ప్రతిభావంతులకు ఈ అవార్డులు ఇస్తారని ఆయన చెప్పారు. అవార్డుతో పాటు పది లక్షల రూపాయల నగదు పారితోషికం కూడా ఇస్తారని ఆయన వెల్లడించారు.