రాజీనామాల ఎపిసోడ్ లో కామెడీగా మారిన పవన్

ప్రస్తుతం ఏపీలో రాజీనామా సవాళ్ల సీజన్ నడుస్తోంది. ఈ ఎపిసోడ్ మొదలు పెట్టింది చంద్రబాబు, దాన్ని పీక్ స్టేజ్ కి చేర్చింది వైసీపీ. మధ్యలో కామెడీ పీస్ గా మిగిలింది జనసేన. మూడు రాజధానుల…

ప్రస్తుతం ఏపీలో రాజీనామా సవాళ్ల సీజన్ నడుస్తోంది. ఈ ఎపిసోడ్ మొదలు పెట్టింది చంద్రబాబు, దాన్ని పీక్ స్టేజ్ కి చేర్చింది వైసీపీ. మధ్యలో కామెడీ పీస్ గా మిగిలింది జనసేన. మూడు రాజధానుల ఎజెండాతో వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. తిరిగి గెలిస్తే  మీరు చెప్పినట్టే చేస్తానన్నారు. రెండు రోజుల తర్వాత మళ్లీ జూమ్ లో బైటకొచ్చి 48గంటల డెడ్ లైన్ విధించి ఇంకాస్త కామెడీ చేశారనుకోండి. అయితే ఈమధ్యలో వైసీపీ నేతలు తగులుకున్నారు. ముందు మీ 23మంది రాజీనామా చేయండి, అమరావతి అజెండాతో గెలవండి అంటూ రెచ్చగొట్టారు.

ఏపీ అసెంబ్లీలో వైసీపీ, టీడీపీతో పాటు జనసేనకు కూడా ప్రాతినిధ్యం ఉంది. మరి జనసేన ఎమ్మెల్యేని ఎవరూ రాజీనామా అడగలేదే. కనీసం పవన్ కల్యాణ్ ని తమ పార్టీ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించాలని ఎవరూ డిమాండ్ చేయలేదే? ఎందుకంటే పవన్ పార్టీ నాయకుడే కానీ ఎమ్మెల్యే కాదు. వారికి ఉన్న ఆ ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా పార్టీ అధినేతను లెక్కచేసే పరిస్థితిలో లేరు. రాజీనామా చేయమని పవన్, రాపాకను ఆదేశించలేరు సరికదా, కనీసం రిక్వెస్ట్ కూడా చేయలేరు.

ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఎవరితో ఉన్నారో తెలియదు, అసలు ఎక్కడున్నారో కూడా పవన్ కి పట్టదు. అలాంటి స్థితిలో జనసేన రాజీనామా అనేది పెద్ద జోక్. అయితే పవన్ కల్యాణ్… వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు అడిగి దీన్ని మరింత పెద్ద జోక్ చేశారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంగతి ప్రస్తావించకుండా మిగతా రెండు పార్టీల ఎమ్మెల్యేలను, అది కూడా కృష్ణా- గుంటూరుకి చెందినవారు మాత్రమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన పవన్ ఈ ఎపిసోడ్ లో కామెడీ పీస్ గా మిగిలిపోయారు.

అటువైపు, ఇటువైపు రాజీనామా సవాళ్లు విసురుతున్నవాళ్లంతా అసెంబ్లీలో సభ్యులు. అసలు సభ్యత్వమే లేకుండా, ఎమ్మెల్యేగా గెలవకుండానే.. మీరంతా రాజీనామా చేయండని అడుగుతున్నారు పవన్. సవాల్ చేయడానికి కనీసం చంద్రబాబుకి ఎమ్మెల్యే పదవి అయినా ఉంది, పవన్ కల్యాణ్ కి పాపం అది కూడా లేదు. కానీ “రాజీనామాల రాజకీయ క్రీడ”లో హీరో అయిపోదామని చూస్తున్నారు. 

టైమ్ బాలేకపోతే ఒక్కోసారి అంతే

బాబుగారి స్టయిల్ ప్లాన్