బాబు బెదిరింపులు పవన్ కి కూడా అబ్బినట్టున్నాయి

స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతిపక్షాలు తలో రకంగా స్పందిస్తున్నాయి. తన మాటకు విలువిచ్చి ఎన్నికలను వాయిదా వేసినందుకు ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలంటూ కాసేపటి క్రితం మాజీ మంత్రి సోమిరెడ్డి పెద్ద జోక్ పేల్చారు. ఇప్పుడు…

స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతిపక్షాలు తలో రకంగా స్పందిస్తున్నాయి. తన మాటకు విలువిచ్చి ఎన్నికలను వాయిదా వేసినందుకు ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలంటూ కాసేపటి క్రితం మాజీ మంత్రి సోమిరెడ్డి పెద్ద జోక్ పేల్చారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా ఇలాంటి జోకులే పేలుస్తున్నారు. కామెడీతో పాటు, పవన్ సీరియస్ నెస్ కూడా చూపిస్తున్నారు.

ఎన్నికలు వాయిదా వేశామంటూ ఈసీ ప్రకటించగానే జనసేనాని మీడియా ముందుకొచ్చారు. వాయిదా కాదు, ఏకంగా రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే పవన్ అధికారుల్ని బెదిరించడం చూస్తుంటే.. ఆయనకి చంద్రబాబు ఆవహించాడా అనే అనుమానం రాకమానదు. అధికార పక్షం అండ చూసుకుని విర్రవీగొద్దు, ప్రభుత్వానికి వత్తాసు పలకడం ప్రభుత్వ అధికారుల విధి కాదు అంటూ ఉద్యోగులపై కాస్త ఎక్కువగానే నోరు చేసుకున్నారు పవన్ కల్యాణ్.

పోలీస్ అధికారులు కూడా ప్రభుత్వానికి తొత్తులుగా మారారని, తమ అభ్యర్థుల్ని బెదిరించి మరీ నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారని, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది కూడా జనసేన-బీజేపీ అభ్యర్థుల్ని బెదిరించారంటూ మండిపడ్డారు. వీరందరి లెక్కలు తేలుస్తానంటూ రెచ్చిపోయారు జనసేనాని. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని కలిసి పరిస్థితి వివరిస్తానని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఎక్కడా ఏమీ జరగనట్టు వ్యవహరిస్తోందని, న్యాయపరమైన పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు.

ఇంతకీ పవన్ కల్యాణ్ పోరాటం దేనికోసమంటే, మరోసారి నామినేషన్లు తీసుకోవాలట. బెదిరిస్తే బెదిరిపోయి, డబ్బుల ఆశలు చూపితే లొంగిపోయే అభ్యర్థులు.. నెల రోజుల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినా అలాగే ప్రవర్తిస్తారు, దానిలో అనుమానం ఏముంటుంది. మరి పవన్ కల్యాణ్ ఎందుకు ఈ విషయంలో ఇంత రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదు.

అన్నిటికీ మించి పవన్ మునుపెన్నడూ అధికారుల జోలికి వెళ్లలేదు, ఈసారి మాత్రం చంద్రబాబు కంటే ఎక్కువగా అధికార యంత్రాంగంపై విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రులతో మాట్లాడతా,  అందరి లెక్కలు తేలుస్తానంటూ హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో మాత్రం పవన్ కి చంద్రబాబే ఆదర్శం అనుకోవాలి.

స్క్రిప్టులో వేలు పెట్టట్లేదు..

నేను గ్యాప్ తీసుకోలేదు.. వచ్చింది