పవన్ కే డెడ్ లైన్…?

పవన్ కళ్యాణ్. సినిమా నటుడు, అలాగే రాజకీయ నాయకుడు. ఆయన జనసేనను స్థాపించి ఏడేళ్లుగా పార్టీని నడుపుతున్నారు. ఆయన ఏపీలో అనేక అంశాలను ప్రస్థావించారు. వాటి విషయంలో హెచ్చరికలు చేస్తూ వచ్చారు. ఆ తరువాత…

పవన్ కళ్యాణ్. సినిమా నటుడు, అలాగే రాజకీయ నాయకుడు. ఆయన జనసేనను స్థాపించి ఏడేళ్లుగా పార్టీని నడుపుతున్నారు. ఆయన ఏపీలో అనేక అంశాలను ప్రస్థావించారు. వాటి విషయంలో హెచ్చరికలు చేస్తూ వచ్చారు. ఆ తరువాత ఎందుకో పోరాటాలను కొనసాగించడంలేదు అన్న విమర్శలు అయితే ఉన్నాయి.

ఇవన్నీ పక్కన పెడితే ఇపుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చిన్న అంశం కాదు, అది యావత్తు రాష్ట్రానికి సంబంధించినది. దాంతో పవన్ ఈ మధ్య వచ్చి కార్మిక పోరాటానికి మద్దతు ప్రకటించారు. దాంతో పవన్ ఏదో చేస్తారని కార్మిక వర్గాలు కూడా ఆశపడ్డాయి.

అయితే పవన్ ఆ విషయం తిప్పి తిప్పి వైసీపీ సర్కార్ మెడకే చుట్టారు. వారం రోజుల వ్యవధిలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సరే పవన్ డిమాండ్ మీద ఏ రకమైన రెస్పాన్స్ లేదు అన్నది అర్ధమవుతోంది.

మరి పవన్ కళ్యాణ్ ఇపుడేం చేస్తారు అన్నదే ప్రశ్న. ముఖ్యంగా కార్మిక సంఘాలు అన్నీ కూడా ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న దాని మీద ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మరి పవన్ చెప్పిన డెడ్ లైన్ టైమ్ అయిపోయింది. ఆయన తనదైన యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తారా లేక ఆ అంశాన్ని అక్కడితో వదిలిపెట్టేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.

మొత్తానికి పవన్ ఏం చేయబోతున్నారు ఇదే చర్చగా ఉంది. అయితే దీని మీద జనసేన నేత శివశంకర్ మాత్రం తినబోతూ రుచి ఎందుకు అంటున్నారు. అంటే పవన్ ఇంతకీ తినిపించబోయే వంటకం ఎలా ఉండబోతోంది. వెయిట్ చేయాల్సిందేనా..