కాదండి.. బాధగా ఉండదాండీ..?

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ సబ్జెక్ట్ ట్రెండింగ్ లో ఉంటుందో ఎవరూ ఊహించలేరు. వైసీపీ ఘన విజయానికి నేటికి ఏడాది. ఆ లెక్కన చూసుకుంటే జగన్ విక్టరీ అన్నది ట్రెండింగ్ లో ఉండాలి, ఉంది…

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ సబ్జెక్ట్ ట్రెండింగ్ లో ఉంటుందో ఎవరూ ఊహించలేరు. వైసీపీ ఘన విజయానికి నేటికి ఏడాది. ఆ లెక్కన చూసుకుంటే జగన్ విక్టరీ అన్నది ట్రెండింగ్ లో ఉండాలి, ఉంది కూడా.

#1YearForYSRCPMassVictory అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. అయితే దీని తర్వాతి స్థానాన్ని మాత్రం బైబై బాబు ఆక్రమించేసింది. ఇది మాత్రం ఎవరూ ఊహించలేదు. ఏడాది గడిచినా చంద్రబాబుపై జనం ఎంత ఆగ్రహంతో, అసహనంతో ఉన్నారనడానికి ఇదే నిదర్శనం.

వైసీపీ సంబరాలు ఓవైపు, టీడీపీకి చాకిరేవు మరోవైపు. సోషల్ మీడియా అంతా దీని చుట్టూనే తిరుగుతోంది. ఓవైపు జగన్ సంబరాల వీడియోలని పోస్ట్ చేస్తూనే మరోవైపు బాబుని తిట్టిపోస్తూ, లోకేష్ ని ఆటాడేసుకుంటున్నారు నెటిజన్లు. నాటి ఎన్నికల్లో బైబై బాబు అనే స్లోగన్ ఇచ్చిన షర్మిళమ్మను మరోసారి అందరూ గుర్తు చేసుకుంటున్నారు. బైబై బాబు అంటూ అప్పట్లో పెట్టిన టిక్ టాక్ వీడియోలన్నిటినీ తిరిగి షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు జగన్ ఫ్యాన్స్. 

ఎన్నికల్లో ఓడిపోయినందుకు కాదు, ఏడాది అయినా ప్రజలింకా ఛీకొడుతున్నందుకే టీడీపీ నేతలు ఉడుక్కుంటున్నారు. మహా అయితే జగన్ ని పొగుడుతారు, వైసీపీ విజయాన్ని గుర్తు చేసుకుంటారనుకున్నారు కానీ, టీడీపీకి ఏడాది పరాజయాన్ని గుర్తు చేస్తూ తద్దినం పెడతారని మాత్రం ఎవరూ అనుకోలేదు.

ఈ ఏడాది కాలంలో తప్పొప్పులు తెలుసుకుని మారకపోగా, ప్రభుత్వంపై అనవసర నిందలు వేయడం, ప్రతి అభివృద్ధి కార్యక్రమానికీ అడ్డుపడటం, వ్యవస్థల్ని మేనేజ్ చేసి తమాషా చూడటం వంటివి ప్రజల్లో చంద్రబాబుని మరింత పలచన చేశాయి. కరోనా కష్టకాలంలో రాష్ట్రానికి దూరంగా ప్రవాస రాజకీయ జీవితం గడుపుతున్న చంద్రబాబుపై ప్రజల కోపం ఇప్పుడప్పుడే చల్లారేలా లేదు. అందుకే సోషల్ మీడియాలో ఈ ట్రోలింగ్ అంతా.

దీన్ని తట్టుకోలేక వెంటనే టీడీపీ పేటీఎం బ్యాచ్ కూడా రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపట్టింది. ప్రజా వేదిక కూల్చేయడం వంటి వీడియోలు పోస్ట్ చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలకు దిగుతోంది. అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ మాత్రం “బైబై బాబు”నే. మరికొంతమంది పవన్ కల్యాణ్ ని కూడా ఆటాడేసుకున్నారు. జనసేనకు డిపాజిట్లు గల్లంతవడం, పవన్ రెండు చోట్ల ఓడిపోవడం, ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఛీకొట్టడం.. ఇలా అన్నీ గుర్తు చేస్తున్నారు.

ఇలా వైసీపీ గ్రాండ్ విక్టరీతో సమానంగా.. టీడీపీ ఘోర పరాజయం కూడా సమానంగా ట్రెండింగ్ లోకి రావడం విశేషం. చంద్రబాబు, లోకేష్ పై వస్తున్న ట్రోలింగ్ చూస్తుంటే.. “కాదండీ.. బాధగా ఉండదాండీ” అన్న బాబు డైలాగే అందరికీ గుర్తొస్తోంది. ఈ డైలాగ్ తో పాటు, “రక్తం పొంగిపోతాఉంది” అనే డైలాగ్  క్లిప్స్ ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతున్నాయి.

త్వరలోనే టాలీవుడ్ కి గుడ్ న్యూస్