ఇండియాలో మ‌ళ్లీ ఊపందుకున్న పెట్రో అమ్మ‌కాలు!

లాక్ డౌన్ కు ప్ర‌ధాన‌మైన రుజువు పెట్రో ఉత్ప‌త్తుల అమ్మకాలు ప‌డిపోవ‌డం. లాక్ డౌన్ నేప‌థ్యంలో వాహ‌నాల‌ను రెండు నెల‌ల పాటు స‌రిగ్గా రోడ్డెక్క‌నీయ‌లేదు. సుదీర్ఘ ప్ర‌యాణాల ఊసే లేదు. స్థానికంగా బైకులు తిర‌గ‌డ‌మే…

లాక్ డౌన్ కు ప్ర‌ధాన‌మైన రుజువు పెట్రో ఉత్ప‌త్తుల అమ్మకాలు ప‌డిపోవ‌డం. లాక్ డౌన్ నేప‌థ్యంలో వాహ‌నాల‌ను రెండు నెల‌ల పాటు స‌రిగ్గా రోడ్డెక్క‌నీయ‌లేదు. సుదీర్ఘ ప్ర‌యాణాల ఊసే లేదు. స్థానికంగా బైకులు తిర‌గ‌డ‌మే త‌ప్ప కార్లు కూడా దాదాపు రెండు నెల‌ల పాటు పెద్ద‌గా రోడ్డెక్క‌లేదు. ఈ నేప‌థ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ల డిమాండ్ ఏ మాత్రం లేకుండా పోయింది. మామూలుగా వీటి అమ్మ‌కాల‌తో పోలిస్తే.. లాక్ డౌన్ స్ట్రిక్ట్ గా అమ‌ల‌యిన స‌మ‌యంలో అమ్మ‌కాలు చాలా త‌గ్గిపోయాయి. 

రొటీన్ గా జ‌రిగే అమ్మ‌కాల‌తో పోలిస్తే క‌నీసం 20-30 శాతం అమ్మ‌కాలు కూడా జ‌ర‌గ‌లేద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. మార్చి 21 నుంచి మే రెండో వారం వ‌ర‌కూ అదే ప‌రిస్థితి కొన‌సాగింది. పెట్రోల్, డీజిల్ అమ్మ‌కాలు చాలా వ‌ర‌కూ త‌గ్గాయి. అయితే ఇప్పుడు పెట్రో ఉత్ప‌త్తుల అమ్మ‌కాలు మ‌ళ్లీ ఊపందుకున్నాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఎంత‌లా అంటే.. లాక్ డౌన్ కు పూర్వం జ‌రిగిన అమ్మ‌కాల‌తో పోలిస్తే 60-65 శాతం అమ్మ‌కాలు ఇప్పుడు జ‌రుగుతున్నాయ‌ట‌!

ఇంకా ఇంట‌ర్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్ కు కొన్ని ప‌రిమితులున్నాయి. అయినా కూడా పెట్రో ఉత్ప‌త్తుల అమ్మ‌కాల్లో దేశం పుంజుకుంటోంద‌ని కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ప్ర‌క‌టించారు. లాక్ డౌన్ పూర్వ రోజుల‌తో పోలిస్తే ఇప్పుడు 60 నుంచి 65 శాతం అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని, లాక్ డౌన్ రోజుల‌తో పోలిస్తే ఇప్పుడు రెట్టింపు స్థాయిలో అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

అంతే కాదు.. వ‌చ్చే నెల ఆరంభానిక‌ల్లా పెట్రో ఉత్ప‌త్తుల అమ్మ‌కాలు లాక్ డౌన్ పూర్వ‌పు స్థాయికి వ‌చ్చేస్తాయని కూడా ఆయ‌న అంచ‌నా వేశారు. జూన్ ఒక‌టి నుంచి రోజు వారీ పెట్రోల్ అమ్మ‌కాలు గ‌తం స్థాయికి చేరుతాయ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. అంత‌ర్జాతీయ మార్కెట్ లో పెట్రోల్ ధ‌ర‌లు బాగా త‌క్కువ స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో పెట్రో ఉత్ప‌త్తుల‌కు డిమాండ్ పుంజుకోవ‌డంతో.. కేంద్ర ప్ర‌భుత్వానికి ఆదాయం భారీగా పెరుగుతున్నట్టే.

టాలీవుడ్ కు ఆంధ్ర ప్రభుత్వం అంతగా ఆనడం లేదు