బీజేపీలో చేరిన ‘దంగల్’ ఫ్యామిలీ!

ప్రపంచ వ్యాప్తంగా విజయవంతం అయిన 'దంగల్' సినిమా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హర్యానకు చెందిన 'ఫోగట్' రెజ్లింగ్ ఫ్యామిలీ కథ ఆధారంగా ఆ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తన కూతుళ్లను…

ప్రపంచ వ్యాప్తంగా విజయవంతం అయిన 'దంగల్' సినిమా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హర్యానకు చెందిన 'ఫోగట్' రెజ్లింగ్ ఫ్యామిలీ కథ ఆధారంగా ఆ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తన కూతుళ్లను సక్సెస్ ఫుల్ రెజ్లర్లుగా తీర్చిదిద్దిన మహావీర్ ఫోగట్ జీవితకథ ఆధారంగా ఆ సినిమాను రూపొందించారు. ఆమిర్ ఖాన్ ఆ పాత్రను చేసి అదరగొట్టడం అందరికీ తెలిసిన సంగతే.

గత కొన్నాళ్లుగా రాజకీయ ప్రయత్నాల్లో ఉన్నారు మహావీర్ ఫోగట్. అందులో భాగంగా లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ముందు హర్యానా ప్రాంతీయ పార్టీ ఒకదాంట్లో చేరారు ఆయన. ఆ పార్టీ ద్వారా టికెట్ ఆశించారు. అయితే అది దక్కలేదు. దీంతో ఆయన పార్టీ మారారు.

భారతీయ జనతా పార్టీలోకి చేరారు మహావీర్ ఫోగట్. తన కూతురు బబితతో కలిసి ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలోనే హర్యానాలో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి చేరికలు చోటు చేసుకుంటున్నాయక్కడ.

అలాంటి జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కోటలు కూలిపోయాయి

అడవిశేష్ తో రెజీనా స్పెషల్ చిట్ చాట్