పవన్, చిరు మీటింగ్.. పక్కనే నాదెండ్ల!

కేవలం పవన్ కల్యాణ్ వెళ్లి చిరంజీవితో సమావేశం అయ్యి ఇలా ఒక ఫొటో పెడితే అది అంతవరకే వార్త అయ్యేది. బహుశా బయటవాళ్ల ఎదురుగా ఈ మధ్యకాలంలో చిరంజీవితో పవన్ సమావేశం అయ్యింది లేదు.…

కేవలం పవన్ కల్యాణ్ వెళ్లి చిరంజీవితో సమావేశం అయ్యి ఇలా ఒక ఫొటో పెడితే అది అంతవరకే వార్త అయ్యేది. బహుశా బయటవాళ్ల ఎదురుగా ఈ మధ్యకాలంలో చిరంజీవితో పవన్ సమావేశం అయ్యింది లేదు. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత తన అన్నని పవన్ కల్యాణ్  వెళ్లి కలిశారని చెప్పుకోవడం మాత్రమే అయ్యేది. అయితే ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ కూడా ఉండటం గమనార్హం.

ఆ మధ్య తానా సభలో కనిపించిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత మళ్లీ తన ఫ్యాన్స్ ను కూడా ఎక్కడ నుంచి పలకరించలేదు. స్వల్ప విరామం ద్వారా ఈ ఫొటోతో మీడియాను, ఫ్యాన్స్ ను పలకరించారు పీకే. సోదరుడు చిరంజీవితో పవన్ సమావేశం అయ్యారు.

మెగా బ్రదర్స్ ఇలాంటి ఫొటోలను అప్పుడప్పుడు విడుదల చేస్తూ ఉంటారు. గతంలో కూడా పవన్ కల్యాణ్ ను చిరంజీవి వెళ్లి కలవడం ఇలానే ఫొటోలు షేర్ చేయడం జరిగింది. ఇక ఎవరో ఒకరిని వెంటపెట్టుకునే  పవన్ కల్యాణ్ ఇప్పుడు నాదెండ్లకు ఆ చోటు ఇచ్చినట్టుగా ఉన్నారు.

జనసేనలోకి చేరినప్పటి నుంచి ఈ జోడీ కొనసాగుతూ ఉంది. ఎన్నికల్లో జనసేన చిత్తు అయినా, పవన్ కల్యాణ్, నాదెండ్ల ఓడిపోయినా వీరి దోస్తీ కొనసాగుతూ ఉండటం గమనార్హం. నాదెండ్ల త్వరలోనే జనసేనకు రాజీనామా చేసి బీజేపీలోకి చేరతారనే ఊహాగానాలున్నాయి. వాటికి కూడా ఈ ఫొటో ఫుల్ స్టాప్ పెట్టినట్టే.

మరి ఇంతకీ వీళ్లిద్దరూ చిరంజీవిని కలవడం కేవలం పలకరింపు కోసమేనా లేక… చిరుకు తమ రాజకీయ ప్లాన్లు చెప్పి మళ్లీ తీసుకురావడానికా!

దేవరకొండ గురించి రష్మిక చెప్పిన ముచ్చట్లు

నటుడి కంటె నాయకుడికే ఎక్కువ కష్టం