నవయుగకు షాక్.. పోలవరం ఇక కొత్త ఆరంభం!

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రివర్స్ టెండరింగ్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి పనులను నూతన కాంట్రాక్టర్ కు అప్పగించడానికి హైకోర్టు ఓకే చెప్పింది. ప్రభుత్వ నిర్ణయంపై స్టే కోరుతూ నవయుగ…

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రివర్స్ టెండరింగ్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి పనులను నూతన కాంట్రాక్టర్ కు అప్పగించడానికి హైకోర్టు ఓకే చెప్పింది. ప్రభుత్వ నిర్ణయంపై స్టే కోరుతూ నవయుగ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఆ పిటిషన్ కు విచారాణార్హత లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

ఇప్పటికే నూతన కాంట్రాక్టర్ ఎంపిక కోసం ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా ఆదా అయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. నూతన కాంట్రాక్టర్ ఎంపిక కూడా జరిగింది. అయితే నవయుగ ఆ అంశంపై కోర్టును ఆశ్రయించింది. అయితే ఆ సంస్థకు న్యాయస్థానంలో ఊరట లభించలేదు.

ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానం కూడా సమర్థించింది. ఈ నేపథ్యంలో నూతన కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో పనులు సాగడానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్టుగా అయ్యింది. ఈ శనివారం నుంచి ఈ ప్రాజెక్టు పనుల్లోకి నూతన సంస్థ రంగంలోకి దిగనున్నట్టుగా తెలుస్తోంది.

ప్రభుత్వాధికారులు- కాంట్రాక్టర్లు భూమి పూజను నిర్వహించి పనులను ప్రారంభించనున్నారని సమాచారం. యుద్ధప్రాతిపదికను పనులను చేపట్టడానికి, రెండేళ్లలో మొత్తం పనులను పూర్తి చేయడానికి అనుగుణంగా సమాయత్తం అయినట్టుగా తెలుస్తోంది.

ఉత్తుత్తినే ఆరోపణలు చేశామని ఒప్పుకున్నట్లేగా!