cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఓటీటీ వేదిక‌గా బిగ్‌బాస్ రియాల్టీ షో!

ఓటీటీ వేదిక‌గా బిగ్‌బాస్ రియాల్టీ షో!

బిగ్‌బాస్ రియాల్టీ షో కొత్త పుంత‌లు తొక్కుతోంది. వ్య‌క్తిగ‌త జీవితాల గురించి తెలుసుకోవాల‌న్న మ‌నిషి బ‌లహీనత‌ల పునాదుల‌పై ఆవిర్భ‌వించిందే రియాల్టీ షో. ప్ర‌స్తుతం తెలుగునాట బిగ్‌బాస్ రియాల్టీ షో సీజ‌న్‌-5 త్వ‌ర‌లో ముగియ‌నుంది. 

డిజిట‌ల్ మీడియా విస్తృత‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఆ ప్లాట్‌ఫామ్‌పై రియాల్టీ షో తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. ఈ మేర‌కు ప్ర‌స్తుత రియాల్టీ షో నిర్వాహ‌కులే ఓటీటీ వేదిక‌గా వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి బిగ్‌బాస్‌ను ప్రారంభించేందుకు సిద్ధ‌మై న‌ట్టు తెలిసిందే. 

ఇందులో 15 మంది కంటెస్టెంట్లు ఉండ‌నున్నారు. వీరిలో టాప్ 5లో నిలిచే వారిని ...వ‌చ్చే ఏడాది చివ‌ర్లో ప్రారంభ‌మ‌య్చే బిగ్‌బాస్ రియాల్టీ షోలో తీసుకోనున్న‌ట్టు తెలిసిందే. ఈ మేర‌కు కంటెస్టెంట్ల ఎంపిక‌కు ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్టు తెలిసింది.

తాజాగా ప్ర‌ధాన రియాల్టీ షో ప్ర‌సార‌మ‌య్యే ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగానే అది కూడా ప్ర‌సారం అయ్యే అవ‌కాశాలున్న‌ట్టు తెలిసింది. ఏది ఏమైనా ఓటీటీ వేదిక‌గా రియాల్టీ షో ప్రారంభం కానుండ‌డం ...డిజిట‌ల్ మీడియాలో శ‌ర‌వేగంగా వ‌స్తున్న మార్పుల‌కు సంకేతంగా చెబుతున్నారు.

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు