cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఉస్మానియాలో ఏడుగురు వైద్యుల‌కు క‌రోనా

ఉస్మానియాలో ఏడుగురు వైద్యుల‌కు  క‌రోనా

క‌రోనాకు వైద్యం చేసే డాక్ట‌ర్ల‌ను కూడా మిమ్మ‌ల్ని వ‌ద‌ల బొమ్మాళీ అని క‌రోనా హెచ్చ‌రిస్తోంది. వైద్యులైతే త‌న‌కో లెక్కా అంటూ క‌రోనా వైర‌స్ స‌వాల్ విసురుతోంది.

ఉస్మానియా మెడిక‌ల్ కాలేజీలో ఏడుగురు జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌కు క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేప‌థ్యంలో ఉస్మానియా మెడిక‌ల్ కాలేజీ అప్ర‌మ‌త్త‌మైంది. మొత్తం పీజీ విద్యార్థులంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నారు.

పాజిటివ్ వచ్చినా.. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఉస్మానియా హెడ్స్ చెబుతున్నారు.

మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ శశికళ మాట్లాడుతూ వైరస్ విస్తరించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. క‌రోనా పాజిటివ్‌కు గురైన ఏడుగురు జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌లో ఇద్ద‌రు అమ్మాయిలు, ఐదుగురు అబ్బాయిలున్న‌ట్టు ప్రిన్సిప‌ల్ వెల్ల‌డించారు.

వీరిని గాంధీ హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు.  క్లాస్ రూమ్స్, ల్యాబ్ లను శానిటైజ్ చేస్తున్న‌ట్టు ప్రిన్సిప‌ల్ తెలిపారు. కాగా జూన్ 20 నుంచి పరీక్షలు ఉండ‌టంతో జూనియర్ డాక్టర్లను హోంక్వారంటైన్ చేస్తున్నామన్నారు.

ఇదిలా ఉండ‌గా  ఏడుగురికి కరోనా పాజిటివ్ రావడంతో ఎగ్జామ్స్ ను వాయిదా వేయాలని   జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. 

కేసీఆర్ ప్లాన్ బాలయ్యకు ముందే తెలుసా

 


×