Advertisement

Advertisement


Home > Politics - Political News

ట్రాఫిక్ చలానా.. వాహనదారులకు తప్పని హైరానా

ట్రాఫిక్ చలానా.. వాహనదారులకు తప్పని హైరానా

ఆన్ లైన్ చలానా విధానం వచ్చిన తర్వాత జాగ్రత్తపడిన వాహనదారులు కొంతమంది ఉంటే.. మరింత నిర్లక్ష్యంతో రోడ్డుపైకొచ్చే వాళ్లు కూడా ఎక్కువైపోయారు. అప్పటికప్పుడు తమ వాహనాన్ని అడ్డుకోరు, సీజ్ చేయరనే ధైర్యంతో ఆన్ లైన్ చలాన్లను పట్టించుకోవడం మానేశారు. కొన్ని సందర్భాల్లో ఒకే వాహనానికి వేల రూపాయల చలానా ఉన్న సందర్భాలు కూడా చూశాం. ఇలాంటి వాటికి చెక్ పెడుతున్నారు సైబరాబాద్ పోలీసులు.

ఒక్క ట్రాఫిక్ చలానా పెండింగ్ ఉన్నా.. ఆ వాహనాన్ని వెంటనే సీజ్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వందలాది వాహనాల్ని ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు. అక్కడికక్కడ చలానా క్లియర్ చేస్తే వాహనం ఇస్తున్నారు. లేదంటే పోలీస్ స్టేషన్ కు బండిని తరలిస్తున్నారు. కోర్టులో ఫైన్ తో సహా డబ్బులు కట్టి వాహనాన్ని విడిపించుకోవాల్సి వస్తోంది.

ఉన్నట్టుంది సైబరాబాద్ పోలీసులు ఇలా చేయడం వెనక అసలు సంగతి వేరే ఉంది. 2020లో సైబరాబాద్ సర్కిల్ లో 47 లక్షల 83 వేల కేసులు నమోదుచేశారు ట్రాఫిక్ పోలీసులు. సదరు వాహనాలన్నింటికీ ఈ-చలాన్లు పంపించారు. ఈ మొత్తం అక్షరాలా 178 కోట్ల 35 లక్షల రూపాయలు. కానీ చలానా కట్టిన వ్యక్తులు అతి తక్కువ మంది. కేవలం 30 కోట్ల 32 లక్షల రూపాయలు మాత్రమే వసూలు అయ్యాయి. దీంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

నిజానికి రూల్స్ ప్రకారం.. 3 చలాన్లు పెండింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే వాహనాన్ని సీజ్ చేయాలి. 3 కంటే తక్కువ ఉంటే సీజ్ చేయకూడదు. కానీ రెవెన్యూ తగ్గిపోవడంతో ఉన్నఫలంగా ఇలా తనిఖీలు ముమ్మరం చేసి, పెండింగ్ లో ఉన్న చలాన్లను ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. అదీ సంగతి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?