Advertisement

Advertisement


Home > Politics - Political News

ఈ లాక్ డౌన్ లో సగటు భారతీయుడి ఖర్చు ఇది!

ఈ లాక్ డౌన్ లో సగటు భారతీయుడి ఖర్చు ఇది!

సుదీర్ఘంగా నెలల పాటు సాగిన లాక్ డౌన్ సగటు భారతీయ వినియోగదారుడి అలవాట్లను మార్చేసింది. తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం, ఇల్లును శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు.. నిత్యావసరాల్ని ఏ స్థాయిలో భద్రపరుచుకుంటున్నారు, వినోదం కోసం ఏం చేశారనే విషయం వాళ్ల ఖర్చులు చూస్తే అర్థమౌతుంది. ఈ కొత్త అలవాట్లు జనజీవనంలో పాతుకుపోయినట్టు కనిపిస్తున్న వేళ.. కొన్ని కంపెనీలు ఊహించని విధంగా భారీ లాభాలు ఆర్జిస్తున్నాయి. 

ఈ లాక్ డౌన్ టైమ్ లో వినియోగదారులు ఎక్కువగా దృష్టిపెట్టిన కొన్ని ప్రొడక్ట్స్ చూద్దాం

నీల్సన్ హోల్డింగ్స్ అంచనా ప్రకారం ఇండియాలో ఒక్క జూన్ నెలలోనే చవన్ ప్రాష్ అమ్మకాలు అమాంతం 283 శాతం పెరిగాయి. ఇక బ్రాండెడ్ తేనె ఉత్పత్తుల అమ్మకాలు 39శాతం పెరిగాయి. దేశంలో అత్యథికంగా ఆయుర్వేద ఉత్పత్తుల్ని సరఫరా చేసే డాబర్ సంస్థ, తన కంపెనీకి చెందిన చవన్ ప్రాష్ అమ్మకాలు 700 శాతం (ఏప్రిల్-జూన్ మధ్య) పెరిగినట్టు ప్రకటించింది. 

మరికొన్ని నెలల పాటు ఈ ట్రెండ్ ఇలానే కొనసాగే అవకాశం ఉందని నీల్సన్ ఇండియా భావిస్తోంది. ప్రజలు ఎక్కువగా రోగనిరోధక శక్తిని పెంచే ఉత్పత్తులతో పాటు శుభ్రతకు సంబంధించిన ఉత్పత్తులపై ఖర్చు చేస్తున్నారని నీల్సన్ సౌత్-ఏసియాకు చెందిన వెస్ట్ మార్కెట్ లీడర్ సమీర్ శుక్లా చెబుతున్నారు. ఇలా ఖర్చు చేయడం ఇప్పట్లో ఆగదని కూడా అంచనా వేస్తున్నారు.

బ్రిక్ వర్క్ రేటింగ్స్ ప్రకారం ప్రకారం.. ఏప్రిల్-జూన్ మధ్య పతంజలి ఉత్పత్తుల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి.

మ్యాగీ, కిట్ కాట్, మంచ్ అమ్మకాలతో నెస్లే ఇండియా సంస్థ, మార్చి నాటికి 10.7 శాతం వృద్ధి చవిచూడగా.. ఏప్రిల్-మే నెలల్లో తమ బిస్కెట్స్ ద్వారా పార్లే సంస్థ అత్యథిక సేల్స్ నమోదుచేసింది. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడిన ఎన్నో కుటుంబాలకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ పార్లే-జి బిస్కెట్లను ఇచ్చాయి. అలా ఈ సంస్థ కనివినీ ఎరుగని రీతిలో అమ్మకాలు జరిపింది. ఈ లాక్ డౌన్ టైమ్ లో బ్రిటానియా సంస్థ కూడా తమ ప్యాకేజ్డ్ ఫుడ్ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రకారం.. కరోనా వల్ల రోడ్డు సైడ్ దొరికే స్ట్రీట్ ఫుడ్ కంటే ప్యాకేజ్డ్ ఫుడ్ కే వినియోగదారులు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు.

ఆన్ లైన్ క్లాసుల వల్ల ల్యాప్ టాప్స్ వినియోగం భారీగా పెరిగింది. మార్చి నెలలో ల్యాప్ ట్యాప్ కోసం తమ సైట్ లో సెర్చ్ చేసే వారి సంఖ్య రెట్టింపు అయిందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఇక డిజిటల్ వినోద రంగానికి వస్తే జీ5 సంస్థ తమ రోజువారీ నెటిజన్ల శాతాన్ని 33శాతం పెంచుకుంది. ఇక మే నెలలో జీ5 యాప్ డౌన్ లోడ్స్ 45శాతం పెరిగాయి. ఇక ఇదే లాక్ డౌన్ టైమ్ లో రిషీకపూర్, సుశాంత్ సింగ్, ఇర్ఫాన్ ఖాన్ లాంటి నటులు మరణించడంతో.. వాళ్ల సినిమాలు చూసేందుకు కూడా ఎక్కువమంది భారతీయులు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ వైపు వచ్చినట్టు అంచనా వేసింది జీ5.

ఇక కరోనా వల్ల సెలూన్లు మూతపడ్డాయి. దీంతో నెలవారీ జరిగే ట్రిమ్మర్ల అమ్మకాలు 5 రెట్లు పెరిగినట్టు హెవెల్స్ సంస్థ ప్రకటించింది. ఇక ఫిలిప్స్ సంస్థ అయితే తమ గ్రూమింగ్ విభాగంలో మే-జూన్ మధ్య ఏకంగా 60 నుంచి 70శాతం వృద్ధిని నమోదుచేసింది.

దాదాపు నాలుగో వంతు భారతీయులు హోం కేర్ ఉత్పత్తులపై ఖర్చుచేయడానికి రెడీ అయ్యారు. మింటెల్ రీసెర్చ్ ప్రకారం.. 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తులు తన జీవనశైలిని పెంచుకునేందుకు ఎక్కువగా హోం కేర్ ఉత్పత్తులపై ఖర్చుచేశారు.

ఇలా ఈ లాక్ డౌన్ టైమ్ లో భారతీయుల సగటు జీవనశైలి కాస్త మారడంతో పాటు వాళ్లు ఖర్చు చేసే విధానంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి.

శ్రీ రెడ్డి వల్ల కొత్తవాళ్ళకి న్యాయం జరిగిందా?

విజయవాడ వీధుల్లో తొడ కొట్టాను

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?