Advertisement

Advertisement


Home > Politics - Political News

మొత్తానికి జగన్ దిగిపోవాలంతే... ?

మొత్తానికి జగన్ దిగిపోవాలంతే... ?

మేడి పండు ప్రజాస్వామ్యంలో రాజకీయాల దిగజారుడుతనం పాతాళం అంచులకే తాకుతోంది. అయిదేళ్ళ పాటు ప్రజలు ఎన్నుకొన్న ఒక ప్రభుత్వాన్ని చాలా సులువుగా దిగిపో అనేస్తున్నారు. ఎంతసేపూ ఎన్నికలు రాజకీయం అధికారమే పరమావధిగానే నేతల మాటలు తిరుగుతూండడమే దారుణం.

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ని అసలు ఊహించుకోవడానికే తెలుగు తమ్ముళ్ళు ఇష్టపడడం లేదు. అందుకే అచ్చెన్నాయుడు దగ్గర నుంచి అయ్యన్నపాత్రుడు వరకూ జగన్ రాజీనామా చేసేయ్ అని ఈజీగా అనేస్తున్నారు. 

మరో వైపు చూస్తే ఏపీలో రాజ్యంగ వ్యవస్థలు భ్రష్టుపట్టాయని కూడా కొత్త రాగాలు అందుకుంటారు. రాష్ట్రపతి జోక్యం కావాలని డిమాండ్ చేస్తారు. ఏపీ సర్కార్ ని బర్తరఫ్ చేయాలని గొంతెమ్మ కోరికలు కోరుతారు.

నిన్ననే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఫలితం విపక్షాలకు గట్టి జవాబు చెప్పింది. దానికి ముందు లోకల్ బాడీ ఎన్నికలో కూడా జనం తీర్పు అంతా చూశారు. గత ఏడాది మత్తు డాక్టర్ విషయంలో ఇలాగే యాగీ చేసినా జనాలు అవేవీ పట్టించుకోలేదని అర్ధమవుతున్నా ఇపుడు రఘురామ క్రిష్ణం రాజు విషయంలో అదే అవేశం, ఆయాసం తో విపక్షాలు ఘాటు విమర్శలు చేస్తున్నాయి.

ఇక బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుకు అయితే జగన్ ముఖ్యమంత్రి పదవి నుంచి అర్జంటుగా దిగిపోవాలంట. ఆయన భార్య భారతిని సీఎం ని చేయాలంట. అపుడే ఏపీలో శాంతి భద్రతలు ఉంటాయట. అంటే ఇక్కడ అందరికీ అర్ధం అయ్యేది ఏంటి అంటే జగన్ భార్య అయినా సీఎం గా ఉండాలి తప్ప జగన్ మాత్రం ఉండకూడదు.

జగన్ సీఎం గా ఉంటే గెలవలేమని భయమా లేక మరేంటో తెలియదు కానీ జగన్ కుర్చీ దిగాలంతే అంటున్నారు. మొత్తానికి ఏ చిన్న ఘటన ఏపీలో జరిగినా జగన్ రాజీనామా అంటూ రెండేళ్ళుగా డిమాండ్ చేయడం విపక్షాల దివాళా కోరుతనాన్నే బయటపెడుతోందని వైసీపీ నేతలు అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?